గోకులాష్టమి సందర్భంగా
===================
ఆటపాటలందు అల్లరి పిల్లలు
చిన్ని కృష్ణ వలె చిందులేయు
నవ్వు మోమువున్న నడిచేటి జాబిల్లి
కన్నులందు నిలువు కవనకృష్ణ
పిలిచినంత పలికి పిల్లెల గ్రోవిన
ఆలమందలందు ఆడి పాడి
తీపి పలుకులందు రేపల్లెసందుల
చిక్కడాయె తండ్రి చిన్నికృష్ణ
బాలగోకులాన బాల్య క్రీడలుగను
సాగినట్టి తీరు సకల శుభము
అటుకులన్ని బుక్కిన కుచేల నేస్తము
మరువలేరు యెపుడు మైత్రికృష్ణ
ధర్మరక్షనందు దండిగా సాగుతూ
సమరశంఖమూదు చక్రదారి
పక్షపాతియనుచు పాండవేయుడుగను
నీతి న్యాయమందు నిలిచెకృష్ణ
గోకులాష్టమందు గోపాలసవ్వడి
ఉట్టికొట్టదరువు చిట్టిమువ్వ
భాగ్యసీమ నందు భాగవతచరిత
శాంతి కోరునెపుడు శౌర్యకృష్ణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి