శంకరవిజయాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 అపరశివావతారం ఆదిశంకరాచార్యులవారి జీవిత చరిత్ర ప్రతివారూ చదివి తీరాల్సిందే! ఇప్పటికీ కేరళ లోని కాలడిలో ఆయన పుట్టిన గది తల్లికి  అంతిమ సంస్కారం చేసినప్రాంతం అక్కడ వెలిగే అఖండ జ్యోతిని మనం   చూడొచ్చు. అది అగ్రహారం. శంకరుల కులదైవం కృష్ణుడు.గోవిందా అన్న నామస్మరణ నేర్పింది ఆయనే.తల్లి కోసం పూర్ణానదిని ఇంటివైపు మరల్చాడు.5ఏళ్ల పిల్లాడు గా కనకధారాస్తోత్రం చేశాడు.కత్తులునూరే కసాయివారిని సమీపించి వారి లో భక్తి నైతిక విలువల బాధ్యత నేర్పింది కూడా ఆయనే! ఒక బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అనిఅంటాడు 5ఏళ్ల శంకరుడు. ఆమె సిగ్గుపడుతూ ఏడుస్తూ ఓఎండిన ఉసిరికాయ ఉంటే ఇస్తుంది. ఆమె భర్త నియమనిష్ఠలతో రాలిన ధాన్యం పళ్ళు  తెస్తె అదే వండేది ఆమె.ఏకాదశి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశిరోజు సూర్యోదయం కాగానే ఆహారం తినాలి. ఉసిరి కాయ తప్పక తినాలి.ఆపూల్పట్టం అనే ఆప్రాంతం లో కనకధారాస్తోత్రము చదివిన ఇల్లు ఇప్పటికీ ఉంది. ఆవంశంవారు ఉన్నారు. లక్ష్మిదేవి ని స్తోత్రం చేయగానేజలజలా బంగారు ఉసిరి కాయలు రాలినాయి.శంకరులు అమ్మ నిలా స్తుతిస్తాడు" అమ్మా! ఈబ్రాహ్మణి విహంగశిశౌ అంటే చిన్న పక్షిపిల్ల.అద్భుతమైన రెండు పక్షులుఉన్నాయి.చకోరం కేవలం వెన్నెల తో కడుపు నింపుకుంటుంది.   చాతకపక్షి కంఠంకింద చిల్లి ఉంటుంది. దాని కి కడుపు నిండదు.విపరీతమైన ఆకలితో అలమటిస్తూనే ఉంటుంది. ఆకాశంలోంచి వర్షం పడుతుంటే అది గాల్లోకిఎగిరి
 మెడనితిప్పి దానికున్న  బెజ్జంలో ఆనీరుపడేలా శ్రమిస్తుంది.ఆనీరు దాని పుట్టలోకి పోయాక శాంతిస్తుంది.అలాంటి పక్షి అమ్మా మేము అంటారు ఆయన కనకధారాస్తోత్రములో!
5ఏళ్ల శంకరులు అపరశివావతారం. శివుడే పుట్టాడు. బ్రహ్మ మండనమిశ్రునిగా సరస్వతి  సరసవాణిగా( ఉభయభారతి) జన్మించారు. ఆమె భర్త శంకరులవాదానికి మధ్య వర్తిగా ఉండి భర్త ఓడిపోతే "మీరిద్దరూ భిక్షకి రండి" అని పిలుస్తుంది. భోజనం చేయండి అని అనరాదు. కేవలం సన్యాసం స్వీకరించినవారికి మాత్రమే "భిక్ష" అనే పదం వాడితీరాలి🌷
కామెంట్‌లు