ఇంకా భూమి మీద జరిగే వాటిని భూమి మీద నుంచి గ్రహించే దేవతలు ఉన్నారు అయితే మరికొందరు దేవతలు తృష్ణత్రయo నుoచి విముక్తులై సతితో ఎరుకగలిగి సంఘటిత పదార్థాలన్నీ (వనగూడినవన్నీ) అనిత్యాలు అలాంటప్పుడు పుట్టి పెరిగిన వన్నీ పతనమవకుండా ఎలా ఉంటాయి అలా ఉండడం అసాధ్యం ఆడుకుంటూ ఉంటారు అని తెలియపరిచాడు భగవాన్ ఇప్పటివరకు వివిధ ప్రాంతాలలో వస్సావాసం గడిపిన తర్వాత స్వామి ని చూడడానికి ఆ విధంగా గౌరవించబడే వారు మేము చూడగలిగాము కానీ భగవాన్ తధాగతులు మహాపరి నిర్వాణం చెందిన తర్వాత ఇక ఇలా చేయడం చూడలేము కదా అన్నాడు ఆనందుడు ఆనందా ధార్మిక మార్గంలో స్ఫూర్తిని పొందటానికి నాలుగు ప్రదేశాలు ఉన్నాయి ఏమిటి అని ఆరుగు ప్రదేశాలు ఎక్కడ సభాగతుడు పుట్టాడు సిద్ధార్థుడు పుట్టిన లుంబిని వనం ఆ ప్రదేశం దమ్మంలో విశ్వాసం గల వారికి స్ఫూర్తినిచ్చే పవిత్ర స్థలమవుతుంది ఎక్కడ తథాగతుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాడో బుద్ధగయ ఆ ప్రవేశం ధర్మం పట్ల విశ్వాసం ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే పవిత్ర స్థలమవుతుంది ఎక్కడ సభాగతుడు అనితరమైన దమ్మచక్రాన్ని ప్రవర్తింపచేసాడు సారనాథ్ ఆ ప్రదేశం ధర్మం పట్ల విశ్వాసం గల వారికి స్ఫూర్తినిచ్చే పవిత్ర స్థలమవుతుంది ఎక్కడ తృష్ణ త్రయాన్ని త్యయించి మళ్లీ పుట్టుకొలేని పరినిర్వాణాన్ని పొందుతారు కుసి నారా ఆ ప్రదేశం దమ్మo పట్ల విశ్వాసం గల వారికి స్ఫూర్తినిచ్చే పవిత్ర స్థలమవుతుంది దమ్మం పట్ల విశ్వాసం గల బిక్షవులు భిక్షునియులు ఉపాసక ఉపాసికులు కూడా ఆయా ప్రదేశాలకు వెళ్లి ఇక్కడే తథాగతుడు జన్మించాడు ఇక్కడే తధాగతుడు పరమ జ్ఞానాన్ని ప్రవర్తింపజేశాడు ఇక్కడే తధాగతుడు నిరుపాది పరి నిర్మాణాన్ని పొందాడు అని చెప్పుకుంటారు.ఇలా విశ్వాసంతో ఈ పుణ్యక్షేత్రాలను ఇక్కడి ఆలయాలను చేత్యాలు ను సందర్శించిన వాడు చనిపోయిన తర్వాత ఉన్నత లోకాలకు ఒక్కోసారి స్వర్గలోకానికి చేరుకుంటారు భగవాన్ అవశేషాలను మేము ఎలా గౌరవించాలి అన్న దానికి సమాధానంగా ఆనంద సభాగతుని శరీర అవశేషాలను ఏరకంగా గౌరవించాలి అనే విషయంపై నీవు అనవసరంగా కాలయాపన చేస్తున్నావు నీవు గమ్యానికి చేరువ అయ్యే ప్రయత్నాలలో ఉండు తథాగతని అవశేషాలను తగురీతులో గౌరవించడానికి జ్ఞానులు అయిన గృహస్తులు ఉన్నారు ఆ పనిని చూసుకుంటారు అన్నాడు బుద్ధుడు కానీ భగవాన్ తథాగతుని అవశేషాలను ఏం చేయాలి ఎలా గౌరవించాలి అని మళ్లీ అడిగాడు ఆనందుడు ఆనంద ఒక విషయం సామ్రాట్ లేక చక్రవర్తి అవశేషాలను ఎలా గౌరవిస్తారో అలాగే తథాగతుని శరీర అవశేషాలను కూడా గౌరవించండి అని చెప్పాడు
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి