తెలంగాణ ఉద్యమ పోరు కోసం విద్యావంతులైన డాక్టర్లు, న్యాయవాదులు ముందుకు రావాలని ఆచార్య జయశంకర్ సార్ పిలుపు ఇవ్వగానే స్పందించి ముందుకు వచ్చారు డాక్టర్ నిగవాడ్ ముత్యం రెడ్డి. తన తోటి వైద్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేశారు. డాక్టర్ల అందరితో సమలోచన చేసి, డాక్టర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయటానికి నాంది పలికారు. డాక్టర్ల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వీరు మహారాష్ట్రలోని కీని గ్రామములో శ్రీమతి అమృతబాయి శ్రీ రామ్ రెడ్డి దంపతులకు జన్మించారు. వైద్య విద్యాభ్యాసం చేసి, బైంసాలో ఆసుపత్రిని నెల్కొల్పి వైద్య సేవలు అందిస్తున్నారు.2009లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమ తీరును అనుసరిస్తూ అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు. భైంసా డాక్టర్ల అందరిని ఏకతాటిపై నడిపిస్తూ ఉద్యమానికి ఊదం అందించారు. ఉద్యమానికి అండగా డాక్టర్ ఏ దామోదర్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, డాక్టర్ ఎం మహిపాల్, డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ నరేష్ బచ్చువార్ , డాక్టర్ గుజ్జల్ వార్ సంతోష్, డాక్టర్ జి రాజారెడ్డి, డాక్టర్ నాగేష్ వంటి ఎందరో మంది డాక్టర్లు డాక్టర్ ముత్యం రెడ్డితో కలిసి పని చేశారు . ఉద్యమం కోసం చేసిన నిరాహార దీక్షల్లో, వంటావార్పు, ఆటపాట, బందులు, మానవహారం, సాగర హారం , బతకమ్మ, రాస్తారోకో వంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి తనదైన శైలిలో గళము విప్పారు. ఆసుపత్రుల్లో గడపవలసిన సమయం రోడ్లపైన ఉద్యమాలతో గడిపారు. ఆర్థికంగా నష్టం జరుగుతున్న ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు. ఒకవైపు రోగులకు ఊపిరి పోస్తూ , మరోవైపు ఉద్యమానికిఊపిరి పోశారు. ఉద్యమంలో క్రీయశీలక పాత్ర పోషించారు. ఉద్యమాన్ని నడిపించే శక్తిగా మారి ఉద్యమానికి శక్తి అందించారు. ఉద్యమాన్ని నడిపించే చైతన్య శీలురుగా మారి ఉద్యమాన్ని నడిపించారు.
ఆచార్యుల పిలుపున కు స్పందించిన డాక్టర్ ముత్యం రెడ్డి;=..జాధవ్ పుండలిక్ రావు పాటిల్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి