ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలు మెట్టూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. 1974 ఆగష్టు పదో తేదీన చారిత్రక నేపథ్యంలో స్థాపించబడిన యుటిఎఫ్, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏభై ఒకటో యేట అడుగిడిన సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ కొత్తూరు మండల యూటిఎఫ్ అధ్యక్షులు అవలంగి శోభన్ బాబు చేతుల మీదుగా యుటిఎఫ్ పతాకావిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బోడ శ్రీను మాట్లాడుతూ యూటిఎఫ్ అంటే పోరాటాలకు స్ఫూర్తి అని, న్యాయపరమైన సౌలభ్యాలు హరించిననాడు వెనువెంటనే సదరు హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమ కెరటం అంటే యూటీఎఫ్ అని అన్నారు.
కొత్తూరు మండల యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి విజయకుమార్, కార్యవర్గసభ్యులు లక్ష్మీ నారాయణ, రవి, వీర భద్రయ్య, రాజారావు, గణపతి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి