వర్ష ఋతువులో తొలి మాసం శ్రావణం. పున్నమి రోజున శ్రవణం నక్షత్రం ఉన్న నెలను ‘శ్రావణమాసం’ అంటారు. ఇంటింటా ఆడపడుచులకు ఆనందాన్ని పండించే నోములు, వ్రతాల పవిత్ర మాసం ఇది.ఈ నెలలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. మంగళగౌరి, వరలక్ష్మీ పూజలతో పాటు ఏకాదశి రోజుల్లో శైవ, వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. నాగచతుర్థి, గరుడ పంచమి రోజున నాగేంద్రునికి పూజలు చేస్తారు.చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. కనుక ఈ మాసాన్ని శ్రావణమాసం అని పిలుస్తారు. ముఖ్యంగా నోములు నోచే వారికి వ్రతాలు చేసే వారికి శ్రావణమాసం చాలా శుభప్రదమైనది.చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో నాలుగవ తిథి చవితి లేదా చతుర్థి. అధి దేవత - వినాయకుడు.నాగచతుర్ధి ని మన రాష్ట్రంలో నాగుల చవితి పండుగలా నాగ పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా , అన్నీ సవ్యంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏడాది పొడవునా అంతా అనుకూలంగా ఉంటుంది.నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప , పూజ గదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం , పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి.
ఇంటి గడప , పూజ గదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం , పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి