యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తున్నాం. .......యుటిఎఫ్.

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం రాజాం తాలూకా మండలాల ప్రతినిధులు కార్యవర్గ సభ్యులతో అంబేడ్కర్ జంక్షన్ వద్ద యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యుపిఎస్)కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంను చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంను ఉద్దేశించి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ ఉన్న ఈ యుపిఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, పాత పెన్షన్ స్కీమ్ ను మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన జిపిఎస్ ని తాము తిప్పికొట్టామనీ ఓపిఎస్ మాత్రమే తమ డిమాండ్ అని పోరాడామని గుర్తుచేసారు. అట్టి జిపిఎస్ విధానాన్నే కాస్తా మార్పులు చేసి యుపిఎస్ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏవిధమైన మేలు జరగదని, ఓపిఎస్ వల్ల మాత్రమే న్యాయం జరుగుతుందనీ అన్నారు. ఓపిఎస్ సాధించేవరకూ యుటిఎఫ్ పోరాడుతునే ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జి.రమేష్, కురిటి బాలమురళీ కృష్ణ, ఎం.వి.నాయుడు, మారెళ్ళ కృష్ణమూర్తి, బి.గౌరీశ్వరరావు, బలివాడ నాగేశ్వరరావు, మువ్వల రమేష్ , ఎం.ప్రసాద్, ఎం.శ్రీరాములు, డి.రామారావు మరియు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, జిసిగడాం మండలాల ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొని, ప్రసంగించారు. నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేసారు.
కామెంట్‌లు