మర్మ మన్నదే ఎరుగని
నిర్మల హృదయాల
కమ్మని భావన పోలిన
సుమదారుల జాడల
అహము లేక అందరితో
ఇహములోనే ఇంపుగా
ఊహకందని స్వర్గాన్ని
మహత్తరంగా అనుభవించు
పూలబాల కలిగివున్న
అలజడిలేని అంతరంగపు
వెల లేని సుందర జీవనము
అలవాటైన బ్రతుకెంత గొప్పదో!
స్వప్నాలన్నవి లేకుండా
సత్యమైనదేదో స్వాగతించి
నిత్య సంతోషపు సంపదతో
స్వఛ్చంగా విరిసే నవ్వెంత గొప్పదో!
సుధ చిందు పిలుపులతో
మధురమైన మాటలతో
కుదురైన మనసుతోటి
ఎదురులేక నడిచే త్రోవెంత గొప్పదో!
మనసు నిండిపోయేలా
మంచి మనకెదురైతే...
కొంచెమైన వెనుకాడక
పంచిపెట్టు మనసెంత గొప్పదో!
జగతికంత వెలుగుపంచి
ప్రగతి బాట తెలియచెప్పి
యుగయుగాల పర్యంతం
జగాలను నడిపించే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి