న్యాయాలు-602
పృష్టాకోటి న్యాయము
******
పృష్ట అనగా అడగబడినది,చల్లబడినది,ప్రశ్న .కోటి అనగా అంచు,వింటికప్పు,చివర, సముదాయము,గరిష్ఠ సంఖ్య అనే అర్థాలు ఉన్నాయి.
పృష్టా కోటి అనగా సర్వజ్ఞుడు కాకపోయినా అడిగిన ప్రశ్నల సముదాయానికి వలసినంత/ తెలిసినంత మేరకు సమాధానాలు చెప్పిన చాలు అని అర్థము.
అయితే ఈ సమాధానాలు చెప్పడానికి కొంత యోచన ,అనుభవం, విషయ గ్రాహ్యత, సమయస్ఫూర్తి ఉంటే సరిపోతుంది. మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ధర్మరాజును పరీక్షించుటకు యమ ధర్మరాజు యక్షుని రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వేస్తాడు . అప్పుడు ధర్మరాజు తనకున్న లోకానుభవం, సమయస్ఫూర్తి,యోచనతో జవాబులు చెప్పి యమధర్మరాజును మెప్పిస్తాడు. అందులో కొన్నింటిని చూద్దాం.
1.గాలి కంటే వేగమైనది - మనసు,2.నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది - చేప.3.జన్మించియు ప్రాణం లేనిది ఏదీ?- గుడ్డు.4.రూపం ఉన్నా హృదయం లేనిది? - శిల్పం .5.లాభాల్లో గొప్పది ఏది? - ఆరోగ్యం.6.సుఖాల్లో గొప్పది ఏది?- సంతోషం.7.దుఃఖం అంటే ఏమిటి? - అజ్ఞానం కలిగి వుండటం.8. మంచిగా మాట్లాడే వారికి ఏమి దొరుకుతుంది?- మైత్రి... ఇలా వేసిన ప్రశ్నలకు సమయస్ఫూర్తితో తనకు తెలిసిన మరియు అవసరమైన సమాచారాన్ని చెప్పి యమధర్మరాజుతో భేష్ అనిపించుకుని యుధిష్ఠిరుడు తన తమ్ములను రక్షించుకుంటాడు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ధర్మరాజును అడిగిన ప్రశ్నలన్నీ అనుభవాలను,తన జీవితంలో చుట్టూ పరిసరాల గమనికలను బట్టి చెప్పగలిగేవే. సామాన్యుడు సర్వజ్ఞుడు కాకున్నా ఇలాంటివి అలవోకగా చెప్పగలడు.
అందుకే అందరూ బాగా చదువుకునో, పుస్తకాల సారాన్ని కాచి వడపోసో అతి వివేకవంతులూ, విజ్ఞానవంతులు కానంత మాత్రాన వారికి ఏమీ తెలియదు రాదు అని ఒక నిర్ణయానికి రాకూడదు.వారికి తెలిసినంత మేరకు ప్రశ్నకు సరైన సమాధానం చెబితే చాలు.
అంటే శాస్త్రాలు చదివితేనే కాదు కొన్నింటికి చూసి,విని, అనుభవం ద్వారా చెప్పగలరని, వారిని చులకన చేయకూడదని భావం. మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఈ విధంగా తెలుసుకొనే ఆరోగ్య సంబంధమైన ప్రశ్నలకు చిట్కా సమాధానాలు చటుక్కున చెప్పేవారు.
ఈ సందర్భంగా దీనికి దగ్గరగా ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన సినీగీతాన్ని చూద్దామా...
"చదువు రాని వాడవని దిగులు చెందకు - మనిషి మదిలోన మమత లేని చదువు లెందుకు/ ఏమి చదివి పక్షులు పైకెగరగలిగెను/ ఏ చదువువల్ల చేప పిల్ల ఈదగలిగెను/ చదువులతో పని యేమి హృదయమున్న చాలు" అనే పాటలో అనుకరణ, అనుభవంతో పాటు మనిషిలో జీవితములో మమత కూడా ఉండాలని అంటారు.
ఇలా మన పెద్దవాళ్ళు"పృష్టా కోటి న్యాయము"ను ఉదాహరణగా చెప్పడానికి కారణం"మరీ నోట్లో నాలుక లేకుండా బతకొద్దని,ఎంతో కొంత అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగే తెలివితేటలు పెంచుకుంటే చాలనే అంతరార్థం ఇందులో ఇమిడి ఉంది మరి మనం కూడా వాళ్ళనుండి నేర్చుకున్న విషయాలతో సమయస్ఫూర్తితో సంతృప్తి పరిచే సమాధానాలు చెబుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి