పరమచోరచక్ర--న:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నాగంలా
ధన దాహపు పన్నాగం
బుస కొడుతూ వస్తున్నది 
మమకారపు మోహపాశం
తమకుతామే బిగించుకుంటూ 
అధికారపు మంత్రదండాన్నాడిస్తూ 
తమ గిద్దెలన్నీ నింపుకునే
గద్దెనెక్కిన మంత్రసానులు 
ప్రజల నొప్పులు మాన్పగలరా!
పదవులంటే కామధేనువు కల్పవృక్షం
వాటి నొదిలిన తక్షణం
పనికి రారు మరుక్షణం 
అందుకే!
న్యాయానికీ ధర్మానికీ
తమలోనే గోరీకట్టి
చేస్తున్నారు నాయకులంతా
రాజకీయపు వ్యభిచారం
అందుకే!
నఖశిఖ పర్యంతం
కుష్టురోగై కుళ్ళిపోతూ
రాలిపోతోంది
ఈనాటి రాజకీయం
బార్లూ బీర్లూ కార్లూ షికార్లతో
నిషాతో ఖుషీచేస్తున్నారు
నాయ"కులము" అని చెప్పుకునే
బడాచోర్లూ బాకాదార్లూ
అందుకే….
వీరందరికీ
"పరమచోరచక్ర"
బిరుదిస్తే నే సంతోషిస్తా!!
**************************************

కామెంట్‌లు