కడుము పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 నేటి బాలలంతా విజ్ఞాన సముపార్జనతో పాటు, దేశభక్తి కలిగియుండాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత ఆయన పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. 
గ్రామ సర్పంచ్ గుజ్జ రామారావు, 
ఎంపిటిసి వి.గోవిందరావు,  
మాజీ సర్పంచ్ వలురౌతు ధర్మారావు తదితర గ్రామపెద్దలు పాఠశాలలో గల గాంధీజీ, అంబేద్కర్, సరస్వతీదేవి విగ్రహాలతో పాటు 
పాఠశాల వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు కీ.శే.వలురౌతు జగన్నాధం విగ్రహానికి పూలమాలలు వేసారు. 
వ్యాయామ ఉపాధ్యాయులు జన్ని చిన్నయ్య ఆధ్వర్యంలో అనేక రకాల క్రీడా పోటీలు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతులమీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
గతేడాది పదోతరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన కిల్లారి దీప్షికశ్రీ, సింహాద్రి యామిని, కిల్లారి లావణ్యలకు 3500, 3000, 2500 రూపాయల నగదు పారితోషికాలను 1999-2004 పూర్వ విద్యార్ధుల సంఘ సభ్యులు బహూకరించారు. 
ఇదే విధంగా ప్రతీయేటా పదోతరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన తొలి స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు ప్రోత్సాహకంగా, 3500, 3000, 2500 రూపాయీల  నగదు పారితోషికాలను బహూకరించనున్నట్లు 1999-2004 పూర్వ విద్యార్ధుల సంఘ సభ్యులు తెలిపారు.
ఇదే వేదికపై ఆ సంఘ సభ్యులు పాఠశాల కార్యక్రమాల వినియోగం నిమిత్తం సరస్వతీదేవి, నటరాజ కాంస్య విగ్రహాలను  ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావుకు అందజేసారు. 
ఈ కార్యక్రమంలో వేదికనలంకరించిన పెద్దలంతా భారత స్వాతంత్ర్య సాధనకై  సమరయోధులు చేసిన త్యాగాలను, చేసిన కృషిని వివరిస్తూ ప్రసంగించారు. 
ఉపాధ్యాయులు
ముదిల శంకరరావు, కుదమ తిరుమలరావులు దేశభక్తి గీతాలను ఆలపించిరి. 
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 
అదేవిధంగా జాతీయ జెండా చేతబూని ప్రదర్శించిన మార్చ్ ఫాస్ట్ మిక్కిలి దేశభక్తిని చాటిచెప్పేలా అందరి ప్రశంసలు పొందాయి.
ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, 
ఉపాధ్యాయులు దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు