జనగణమన యని పాడరాదా
భారతీయుడా! ఓ భారతీయుడా!
నిన్ను చూసి ప్రియ భారతి
మారిసెనోయీ
!!జనగణమన!!
తుంగభద్ర కృష్ణమ్మ గోదావరీ
గంగా బ్రహ్మపుత్ర యమునానదీ
గలగల మని పారెనా
కొలువుండు అన్నపూర్ణ నీయెదలో
!!జనగణమన!!
కులమతాల రక్కసినీ
కూల్చివేయ ప్రతినబూని
నవభారత నిర్మాణం
ప్రతి పౌరుని కరవ్యం
!!జనగణమన!!
ఐకమత్యపుబాట
మనమంత నిలిచీ
భారతీయుల ఘన చరిత్ర
లోకానికే చాటి
!!జనగణమన!!
మన దేహపు కణం కణం
భరతమాత సమర్పణం
మన నెత్తుటి చివరి బొట్టు
భరతమాత సిందూరం
!!జనగణమన!!
**************************************
భారతీయుడా! ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్ గారికి అభినందనలు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి