22 ఏళ్ల ఉషామెహతా బ్రిటిష్ కాలంలో తన 8వ ఏటసైమన్ గో బ్యాక్ అంటూ రాళ్ళు విసిరిన చిన్నారిఅండర్ గ్రౌండ్ లో కాంగ్రెస్ రేడియో నడిపింది.బాంబేయూనివర్శిటీ హెచ్.ఓ.డీ.గాఉన్న ఆమె పద్మవిభూషణ్ పొందారు.24ఏళ్లక్రితం మరణించిన ఆమె మనకు ఆదర్శం . ఉషారాణి భర్త కెప్టెన్ జగ్తార్ సింగ్ ప్రమాదవశాత్తు ప్రాణాలు వదిలారు.కవలపిల్లల తల్లి ఉష ఆపసివారి ఆలనాపాలనా చూసుకుంటూ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో మెంటార్ గా పనిచేసి దేశంకోసం ఆర్మీలో చేరిన వీరపత్ని.జైపూర్ లో ఎం.టెక్.చేసిన యశ్విని భర్త ఆర్మీ పైలెట్ మరణంతో కృంగి పోకుండా నేడు లెఫ్ట్ నెంట్ హోదాలో ఆర్మీ లో చేరారు.
కేరళకు చెందిన ధనుజా కుమారి మురికి వాడలో పుట్టింది.9దాకా చదివిన ఆమె చెత్త ఏరుతూ కడుపునింపుకునేది.తండ్రి తాగుబోతు.ఇప్పుడుపారిశుద్ధ్య కార్మికురాలు.రోజూ డైరీ రాస్తూ సత్యన్ అనే రచయిత ప్రోత్సాహం తో ఓపుస్తకం రాసింది.డిగ్రీ పిజి లో అది పాఠ్యాంశం ఐంది.15ఆగస్ట్ రోజు కేరళ గవర్నరు చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు.ఆమె డాక్యుమెంటరీ చిత్రం తీయాలనే ఆలోచనలో ఉంది.ఆమె వయసు 48 ఏళ్లు.
ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలీలాహే తన 27వ ఏంటి కంటిచూపు కోల్పోయింది.32ఏళ్ల ఆమె కాన్సర్ తో పోరాడుతూ ఓప్రయోగం చేసింది.తనతో మాట్లాడటానికి 30మందికి ఛాన్స్ ఇచ్చింది.ఆటైం కి వచ్చిన డబ్బుని కాన్సర్ పరిశోధన కు విరాళం ఇచ్చారు. వర్తమానం లో జీవించి ప్రజోపయోగ పనికి శ్రీ కారం చుట్టండి అనేది ఈమె సందేశం.🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి