శ్లో!కదా వా త్వాం దృష్ట్వా _ గిరిశ!
తవ భవ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం _శిరసి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్యాఘ్రాయ_ స్పటజల జగంధాన్ పరిమళాన్
అలాభ్యాం బ్రహ్మ ద్యై _ర్ముదమనుభవిష్యామి హృదయే !
భావం:
ఓ పరమేశ్వరా ! నిన్ను దర్శించి నీ యొక్క పాదపద్మములను నా చేతులతో పట్టుకొని, వాటిని నా తల యందు ఉంచుకొని, కళ్ళకు అద్ధుకొని, ఎదపై పెట్టుకుని, వాటిని కౌగిలించుకొని, వాటి నుండి వచ్చు పరిమళములను ఆఘ్రాణించి బ్రహ్మాదులకు లభింపని ఆనందమును నా హృదయము లో ఎప్పుడు అనుభవింతునో కదా !!
🌺🌺🌺🌺🌺
శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి