చిరులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరము
చిరుగాలిలో
తిరగాలని ఉన్నది
చిరుమోములను
చూడాలని ఉన్నది

చిరుజల్లులలో
తడవాలని ఉన్నది
చిరునవ్వులను
చిందాలని ఉన్నది

చిరుదివ్వెలను
వెలిగించాలని ఉన్నది
చిరుకాంతులను
వెదజల్లాలని ఉన్నది

చిరుచీకటిలో
నడవాలని ఉన్నది
చిరుతిండులు
తినాలని ఉన్నది

చిరుగజ్జెలు
కట్టుకోవాలని ఉన్నది
చిరుచిందులు
తొక్కాలని ఉన్నది

చిరుతగవులను
పరిష్కరించాలని ఉన్నది
చిరుకోపమును
ప్రదర్శించాలని ఉన్నది

చిరునడకలు
వేయాలని ఉన్ళది
చిరుసాయములు
చేయాలని ఉన్నది

చిరుచిరుమాటలు
చెప్పాలని ఉన్నది
చిరుసంతసాలను
కలిగించాలని ఉన్నది

చిరుకవితలను
రాయాలని ఉన్నది
చిరుసత్కారాలను
పొందాలని ఉన్నది

చిరుకార్యాలను
చేయాలని ఉన్నది
పెనుఫలితాలను
పొందాలని ఉన్నది


కామెంట్‌లు