ఆ రోజులు పోయాయి...!
కన్యా సుల్కాలు- వరకట్నాల
ఆ రోజులు పోయాయి...!!
ఆ రోజులు పోయాయి...!
ఆడ పిల్ల గుండెలమీదకుంప టని... తల్లిదండ్రులు కుమిలి పోయే ఆ రోజులు పోయాయి!!
చాకలి పద్దులు చూసుకోటాని కి...ఈ మాత్ర0చదువుచాలులే
ఇంట్లో ఉండి వంట-వార్పు నేర్చుకో...,అడుగడుగుఆ0క్షలు...వివక్షతోఅణగద్రొక్కటాలు
ఆరోజులు పోయాయి...!!
నేడు.... చదువు- సంస్కారం...
అన్ని రంగాలలో మగపిల్లలకు ధీటుగా...
ముందంజలో ఆడ పిల్లలు...!
ఇవి... నేటి ఆడపిల్లల విజయాలు...!!
ప్రేమాను రాగాల లోను...
బరువు- బాధ్యతల లోనూ
మగపిల్లలకంటే... ఆడపిల్లలే
అనటం అతి శయోక్తి కాదు..!!
అమ్మో... ఆడపిల్లా.. అనుకునే ఆరోజులు పోయాయి..!
సిరి, సంపద, ఆనందాలనిచ్చే
లక్ష్మీ తల్లి పుట్టిందని...
ఆనందించే రోజులివి...!!
ఆడ పిల్లంటే... నిజంగా లక్ష్మీ దేవే...!
ఆడ పిల్ల ఉన్న ఇంటి లోనె...
కళ - కాంతులు..!
ఆప్యాయత - అను రాగాలు...!
ప్రేమాభిమానాలు...!!
ఆడ పిల్లలంటే... రెండు ఇళ్లకు కాంతి దీపాలు...!
ఆడ పిల్లలు... మీరు అందుకొండి సుభాకాంక్షలు...
👏👏👏🎊🎊🎊🎊🎷🎺🎻🎼👍✌️💐🌷💐
రోజులు మారాయి ;-... కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి