విశాఖపట్నం శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్టు వారు విజయవాడ వరద బాధితులను ఆదుకునే దృక్పథంతో సాయం అందించుట పట్ల విజయవాడ రైల్వే సి.ఐ. గండ్రేటి తిరుపతిరావు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ అధ్యక్షురాలు డా. కుప్పిలి కీర్తి పట్నాయక్ ను ఆయన అభినందించారు. కబేళ దగ్గర వరద వచ్చిన రెండవ రోజే ట్రస్ట్ సభ్యులు ఆహార పొట్లాలు పంపిణి చేసారని ఆయన అన్నారు. కబేళతో పాటు డేంజర్ జోన్ లో ఉన్న పాత రాజరాజేశ్వరిపేట, సింగనూర్, భవానీపురం వాసులకు భోజనం పంపే ఏర్పాటు గావించడం మిక్కిలి మానవత్వం తో కూడిన సహకారమని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తి పట్నాయక్ నిర్దేశాలతో విజయవాడలో ఉన్న ట్రస్ట్ ఇన్ చార్జ్ హేమసుందర్ నేరుగా సేవాకార్యక్రమాలలో పాల్గొని ఆవులకు, కుక్కలకు కూడా ఆహరమందించారని ఆయన కొనియాడారు. ఈ ప్రాంతాలతో పాటు సొరంగం, సింగనూర్ కోలనీ వాసులకు వాటర్ బాటిల్స్, ఆహార పొట్లాలు పంపిణి చేయడంతో పాటు, నేటి సాయంత్రం, దుప్పట్లు పంపిణీ చేయుటకై తానే స్వయంగా ముందుకొచ్చానని గండ్రేటి తిరుపతిరావు తెలిపారు. శ్రీదేవి విజ్ఞాన పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు డా.కీర్తి పట్నాయక్ హెల్ప్ లైన్ సర్వీస్ ఏర్పాటు చేసి సామాజిక బాధ్యతతో కూడిన సేవలను అందిస్తున్నారని, గతంలో కరోనా బాధితులకు కూడా సహకరించడం జరిగిందని తిరుపతిరావు గుర్తు చేసారు. ఆనాటి సాయాన్ని మరచిపోలేని ఈ ప్రాంత ప్రముఖులు దుర్గాప్రసాద్, మురళీ, వెంకటరాజు, హేమసుందర్, శ్రీనివాసరావు, గోపాల్, సురేష్ తనతో పాటు బాధితులను ఆదుకుంటున్నామని గండ్రేటి తిరుపతిరావు తెలిపారు. మహోన్నతమైన సేవా దృక్పథం కీర్తి పట్నాయక్ సొంతమని వీరంతా అభినందనలు తెలిపారు.
విజయవాడ బాధితులకు కీర్తి సాయం ప్రశంసనీయం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి