🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు

శ్లో!స్తవైర్బ్రహ్మదీనాం జయ జయ వచోభిర్నియమినాం
గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుది 
స్థితిం నీలగ్రీవం త్రినయన మమూశ్లిష్టవపుషం కదా ?
త్వాం పశ్యేయం కరదృత మృగం ఖండం పరశుమ్!!

భావం: ఓ శివా! బ్రహ్మాదులు చేయు స్తోత్రములు తోను, ప్రమధగణములు చేయు క్రీడలతోనూ, అవి చూసి ఆనందముతో  రంకెలు వేయుచున్న నందీశ్వరుని మూపురము పై కూర్చున్న వాడవనూ, నీలకంఠము కలవాడవునూ, మూడు కన్నులు కలవాడునూ, పార్వతి చే ఆ లింగనము
చేసుకొనబడిన దేహము కలవాడవునూ, లేడిని చేతితో పట్టుకున్న వాడవు నూ, పరశువు  అనే 
ఆయుధమును ధరించిన  వాడవునూ, అయినా 
నిన్ను దర్శించే భాగ్యము ఎప్పుడు  కలుగుతుందో కదా!!
                   ******

కామెంట్‌లు