దస్తూరీతో దైవతాన్ని పోలి
కైతతో శిల్పాన్ని చెక్కి
పద్యామృతంతో జీవం పోసి
అవధానకళతో అలరించి
ఆధ్యాత్మిక విషయాలను అవలీలగా ఎరుకపరిచి
సభలకు నిండైన శోభను సంతరించినావు
అయాచితముగా ఏదీ ఆశించక
పాండిత్యప్రకర్షతో ప్రకాశించినావు.
అధ్యాపకత్వంతో శిష్యుల మనసులు అక్షయంగా దోచి
అధ్యయనంతో అనంతమైన
విజ్ఞానాన్ని సముపార్జించినావు.
సాధనతో శ్రీ నివాసం గావించుకొని
సరస్వతి కటాక్షమును నిత్యము పొందినాడవు
నిరాడంబరివై నడయాడి
వేదాంతసారమంతయూ ఒడిసిపట్టినావు
ఆచార్యుడవై అంబరవీధికేగి
తారకమణివై వెలుగొందగలవు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి