న్యాయాలు-629
బ్రాహ్మణ శ్రమణ న్యాయము
*****
బ్రాహ్మణ అనగా సమూహము వేద భాగము.శ్రమణ అనగా యతి,జైన, బౌద్ధ సాంఖ్య మొదలైన మత సంప్రదాయాలను ఆచరించే వారు.
ముఖ్యంగా "బ్రాహ్మణ శ్రమణ" అనగా రెండు రకాల సన్యాసి వర్గాలు. జైన మత సన్యాసి , యతి.
మరి ఈ బ్రాహ్మణ శ్రమణుల విషయాలు, విశేషాలూ తెలుసుకుందామా...
మన భారత దేశంలో ప్రాచీన కాలం నుండి రెండు భిన్న సంప్రదాయాలు కొనసాగుతున్నాయని మన పెద్దలు చెబుతుంటారు.అందులో 1.శ్రమణులు.2. వైదికులు( బ్రాహ్మణత్వం పాటించే వారు). వీరిలో జైన మతం చాలా పురాతనమైనదని, వీరి శ్రమణ సంప్రదాయం కూడా చాలా పురాతనమైనదని అంటారు.
ఆరవ శతాబ్దంలో అభివృద్ధి పరచబడిన "బృహదారణ్యకోపనిషత్తు"లో ఓ శ్లోకము శ్రమణ గురించి చెప్పబడింది.
అలాగే యజుర్వేదము శ్రమణ ఋషులు మరియు బ్రహ్మచారి ఋషులను గురించి ప్రస్తావించింది.శ్రమణ అనే పదం ష్రం అనే శబ్ద మూలం నుండి ఉద్భవించింది.శ్రమణ అంటే శ్రమ చేయడం.
ముఖ్యంగా జైన సన్యాసులను శ్రమణలు అని పిలుస్తారు.ఈ సన్యాసులు అనుసరించే ప్రవర్తనా నియమావళిని శ్రమణ ధర్మం అంటారు.
శ్రమణుడు ఎలా వుంటాడో,వుండాలో చెబుతూ జైన మతం ఐదు గొప్ప ప్రమాణాలైన మహా వ్రతాన్ని స్వీకరించిన సన్యాసియే శ్రమణుడని అంటుంది.
ఆ ప్రకారం శ్రమణుడు అంటే ఎటువంటి ఆటంకాలు లేని వాడు. కోరికల నుండి విముక్తుడైన వాడు అంటే ఆస్తి, చంపడం, అబద్ధాలు చెప్పడం, లైంగిక సంపర్కం,కోపం, అహంకారం, మోసం, దురాశ, ప్రేమ, ద్వేషం మొదలైనవి విసర్జించిన వాడు.ఇంద్రియాలను అణచి వేసుకుని సన్యాసత్వానికి అర్హత పొంది, తన శరీరాన్ని విడిచి పెట్టగలవాడు శ్రమణ అనే పేరుకు అర్హుడని జైన మతం చెబుతోంది.
ఆధునిక హిందూ మతము వైదిక/ బ్రాహ్మణ మరియు శ్రమణ సంప్రదాయాల కలయికగా మారిందని పెద్దవాళ్ళు అనడం విశేషం.
బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణం అనేది ఒకానొక మత సంస్కృతి. శ్రమణలో ఎన్ని నియమ నిబంధనలు ఉన్నాయో బ్రాహ్మణత్వంలో అలాంటివే ఉన్నాయి. బ్రాహ్మణ అనేది కుల సంకేత పదం కాదని, గుణ సంకేత పదమని, ధార్మిక లక్షణాలు ఉన్న వారే బ్రాహ్మణులని అనాలని చెబుతుంటారు.
అయితే బ్రాహ్మణ,శ్రమణ ... ఈ రెండూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కీలకమైన పాత్రను పోషించాయి. అందుకే ఆ రెండూ సమ్మిళితమై సరికొత్త సంస్కృతి ఉదయించడానికి మూల కారణం అయ్యాయి.
అయితే ఈ "బ్రాహ్మణ శ్రమణ న్యాయం" కొంత విభేదానికి మూలమైనదని, తావిచ్చిందని కొందరు అంటుంటారు.
అవన్నీ కాకుండా "బ్రాహ్మణ శ్రమణ న్యాయం" ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే బ్రాహ్మణుడు స్వధర్మములను విడిచి ఇతర మత ధర్మములను ఆచరించినను అతడిని బ్రాహ్మణుడు అనే అంటారు.అలాగే శ్రమణుడు బ్రాహ్మణ ధర్మములు ఆచరించినను అతడిని శ్రమణ అనే అంటారని తెలిసింది.
అనగా కులం మతం ఉండొద్దు, ఉండవు,ఉండ కూడదు అని ఎంతగా ప్రయత్నించినా అనుకున్నా పుట్టిన శిశువు నుంచి ఆయుషు అనంతంలో కలిసేంత వరకు ఎంత వద్దనుకున్నా నీడలా వెంటాడుతూనే ఉంటాయని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే వాటికి అతీతంగా మనం ఎలా ఉండొచ్చో వేమన రాసిన పద్యాన్ని చూద్దాం.
"పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు/ మాట కన్న నెంచ మనసు ధృఢము/ కులము కన్న మిగులు గుణము ప్రధానంబు/ విశ్వధాభిరామ వినురవేమ!"
ఈ పద్యాన్ని గమనంలో పెట్టుకొని,ఆ ప్రకారం జీవిద్దాం.మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి