భూమి పిలుస్తుంది
ఆకుపచ్చని అరణ్యం పిలుస్తుంది
నీలి సముద్రం పిలుస్తుంది
ఎర్రని ఎడారి పిలుస్తుంది
ఎవరెస్టు శిఖరం పిలుస్తుంది
రా సునీతమ్మ
తిరిగిరా భూలోకానికి!!!!
ఆకాశం నీ ఆశయం
అమ్మ ఆశ నీవు
చందమామ అందం నీవు
మా కుటుంబ బంధం నీవు!!!
మా గుండె నీవు
ఎగిరేసిన జెండా నీవు
మెరిసిన ముత్యం నీవు
ఆకాశంలో నక్షత్రం నీవు!!!
రా సునీతమ్మ తిరిగి భూలోకానికి రా!!
శూన్యంలో విశ్వం పుట్టి
శూన్యంలో కాలు పెట్టింది నీవు
ఒక వెలుతురు నువ్వు
చీకటి చిరునవ్వు నువ్వు!!!!
గాలిపటం కాదు
ప్రపంచ పటం నీవు
ఎక్కడైతే గాలి ఎగరలేదో
అక్కడ గాలికి రెక్కలు నువ్వు
ఒకే ఒక్క దేవకన్యవు నీవు!!?
ఎన్నోసార్లు
తిరిగిరాని లోకాలకు వెళ్లి
తిరిగి వచ్చిన ఉత్తమురాలు నువ్వు!!
ఒక కొత్త చరిత్ర నువ్వు!!!?
భూలోకం పిలుస్తుంది
రా సునీతమ్మ తిరిగి రా!!!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి