శ్లో:
బ్రూమస్తవ సాహసం పసుపతే కస్యాస్తి శంభో భవ
ద్దైర్యం చేదృశ మాత్మనస్స్థితి రియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్దేవగణం త్రసన్ముని గుణం నశ్యత్ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ !!
భావం: ఓ పశుపతీ ! ఓ శంకరా! నీ యొక్క ధైర్యము ను, ఏమని చెప్పుదును, నీ సాహసమును ఏమని వర్ణింతును? నాశనమును
తెలుసుకొని, దేవతలు
పారిపోవుచుండగా, ఋషులు గడగడ లాడి పోవుచుండగా, నీవు ఒక్కడివే పరమానంద పరిపూర్ణుడు అయి
విహరిస్తావు.
****
🪷శివానందలహరి🪷;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి