చెల్లెమ్మా! అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే మా పాఠశాల హిందీ ఉపాధ్యాయ సోదరుడు వేణుమాధవ్ గారు బోధన పట్ల చూపే ఆరాటం,తపన, కృషి చూస్తే ఆశ్చర్యమనిపించక మానదు.
జాతీయ భాష హిందీ పట్ల, విద్యార్థులకు మక్కువ కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ముఖ్యంగా ఈరోజయితే హిందీ భాషా దినోత్సవ వేడుకలను అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వహించారు.
నిజానికి హిందీ భాషా దినోత్సవం సెప్టెంబర్ 14.కానీ ఆరోజు సెలవు కావడం వల్ల ఈరోజు నిర్వహించారు.
వివిధ అంశాలతో క్విజ్ నిర్వహించడమే కాకుండా, చిత్రలేఖనం, హిందీ కవితా పఠనం చేయించి, నగదు బహుమతిని అందించారు.
ఈ సందర్భంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైతం చక్కటి హిందీలో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు.ఉపాధ్యాయ ఉపాధ్యాయినులందరూ కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొని సహకారాన్ని అందించారు.
ఇది హర్షింపదగిన విషయమే కదా.
పద్మ త్రిపురారి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి