శా.
అజ్ఞానమ్మునురూపుమాపుగురువై
యందించువిజ్ఞానమే
జిజ్ఞాసన్ వికసింపజేసిమదిలో* జీవాత్మలక్ష్యంబుగన్!
విజ్ఞానమ్మునునింపుచుండునుసదా
విశ్వానదైవమ్ముగా!
సుజ్ఞానోక్తులబోధజేయు నెపుడున్
శుద్ధాంతరంగంబుతో
శా.
సద్యోజాతుడిగావిరించిహరియైసాక్ష్తాత్ త్రిమూర్త్యాత్ములై
విద్యాబుద్ధులనందజేసిమిగులన్ విశ్వానశోభిల్లగా
విద్యాభారతి స్థానమైనబడిలో విద్యోన్ముఖోత్సాహులై
విద్యాబోధనచేయునట్టిగురువావేవేలదండాలయా
శా.
నిత్యాన్వేషణ జ్ఞానతత్పరుడవైనీయంతరంగమ్ములో
సత్యాసత్యవిచక్షణమ్ముదెలిపీసచ్ఛాత్రులైసాగగా
కృత్యాలెన్నియజేసిబోధనములోకృత్యానువర్తుండునై
నిత్యాధ్యాయుడునైననొజ్జయెసదానేర్చించు క్రోంగొత్తగా
శా.
సద్వాగ్వైభవధారచేగురువులేసద్బోధగావించుచున్
సద్విద్యల్ వెలయింపజేయుచుసదాసంస్కారముల్ నేర్పగా
సద్విద్యాప్రదులైనవారికృపచేసత్కీర్తిసాధించియున్
సద్విద్యార్థులుగానుమారిభువిలోసన్మార్గులైసాగునే
శా.
ప్రజ్ఞావంతులుపండితోత్తములుగాప్రజ్ఞానిధుల్ సర్వదా
అజ్ఞానమ్మునుపార ద్రోలిమదిలోయందించివిజ్ఞానమే
ఆజ్ఞల్వీడకశిష్యబృందముసదాయాజ్ఞల్నిపాటించినా
సుజ్ఞానామృతధారలొందిమిగులన్ శోభిల్లువిశ్వమ్మునా
శా.
విద్యోద్యానమునందువెల్లివిరిసీవిద్యా ప్రసూనమ్ములై
విద్యావైభవశేముషీకుశలురైవిఖ్యాతినార్జించగా
విద్యార్థీనినుతీర్చిదిద్దుగురువులేవిశ్వానదైవమ్ముగా
విద్యాబోధనవృత్తితత్పరులుగావిద్యానుసంధానులై
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో
జి.లింగేశ్వర శర్మ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి