దేశ ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు హిందీ భాష ఎంతగానో దోహదపడిందని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బత్తుల వినీల, బోనెల కిరణ్ కుమార్ ల పర్యవేక్షణలో విద్యార్థులకు హిందీ అంశాలతో కూడిన క్విజ్ పోటీలను నిర్వహించగా, గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేసారు. అలాగే తరగతి గదుల్లో హిందీ పాఠ్యాంశాల చార్టుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆ ప్రదర్శనలలో మిక్కిలి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్రకుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొని ప్రసంగించారు.
హిందీ భాష అలవడితే దేశంలోను, విదేశాల్లోను కూడా మనుగడ సాధించవచ్చని, భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే భాష హిందీయేనని ప్రసంగించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి