పరమశివభక్తుడు దండినాయనార్ అంధుడు.ఆరోజు ల్లో కక్షకార్పణ్యంతో అన్యమతస్థులు అక్కడ ఉన్న తటాకాన్ని మట్టితో పూడ్చేవారు.బహుశ గుడికోనేరు కావచ్చు. ఆవిషయంతెల్సుకున్న దండి అంధుడైనా పరమేశ్వరుడిని తల్చుకుంటూ ఒక్కడే రాత్రి పూట అక్కడకి వెళ్లి మట్టి ని పైకి తీసేసి త్రవ్వుతూ తెల్లారగానే ఇల్లుఛేరేవాడు. ఆదుర్మార్గులు తెల్లారగానే మళ్ళీ కోనేరులో మట్టి పోసి పూడ్చేసేవారు.ఇలా జరుగుతోంది. ఇకతట్టుకోలేక దండి క్రోధం ఆక్రోశం తో ఇలా అరిచాడు " దుర్మార్గులారా! నన్ను గుడ్డివాడా అని తిడ్తారా?జనాలు వాడే కోనేరులో మట్టి నింపుతూ నన్ను ఎగతాళి చేస్తారా? నేను శివారాధకుడిని.నాశివయ్య నాకు దృష్టి ప్రసాదించి మీకళ్లు పోగొడ్తాడు." అంతే ! రాత్రి అంతా మట్టి త్రవ్విపోశాడు.తెల్లారగానే ఆయనకు చూపువచ్చింది.దుర్మార్గులు అంధులైనారు.రాజువారినందర్నీ రాజ్యంలోంచి బహిష్కరించాడు.
కొసమెరుపు..ద్రవిడ దేశంలో కొచ్చింగచోళుడు అనే రాజు 700శివాలయాల్ని పునర్నిర్మాణం చేశాడు.ఏనుగులు దూరకుండా కట్టించాడు. క్రోధం అమిత భక్తి గామారి దైవం కి సన్నిహితంకావచ్చు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి