తూరుపున దూరములో
నిశ్శబ్ద విస్ఫోటనపు
మెరుపుల కాంతిపుంజాలు
వానవిల్లై విరిసెగా అంబరాన!
ఇసుక నేలనైన ఇనుడిరాక
కురిపించు వెలుగుల వాక
సైకత వేదికలపై కాంతిధార
పైడిరజనులా కురిసె కాదా?!
అవనిలో అణువణువూ
జీవ చైతన్యము పొంది
అనుగ్రహముగా ఎంచి
వెలుగులరేడును స్వాగతించె!
ఒక్క సూర్యుడే జగమంతటా
దిక్కులను కలిపే దైవమై
చక్కగ ఉదయించి నీమముగ
మొక్కులను చేకొనె మార్తాండుడై!
వెలుగులను విరజిమ్ము
అరుణకాంతుల ప్రభలతో
జ్యోతి కలశము ప్రభవించి
పండుగ తెచ్చెను నిండుగ భువికి!
పరమాత్ముని ప్రతిరూపమై
ప్రతిదినము ప్రపంచమును
ప్రేమగా పలుకరించి మేల్కొలుపు
ప్రభాకరునికి జోతలు అర్పిస్తూ...
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి