తొలి సంధ్యా సమయంలో
ఇరు కొండల మధ్యన
చిరు కిరణాలతో మొదలై
పెను కాంతులు చిమ్ముతూ....
చీకటి తెచ్చిన దిగులంతా..
చెదిరి పోయి తేలికయేలా
రెప్పలు విప్పిన లోకానికి
గొప్పగ తోచే ఉదయం.
నింగిని రంగులమయం చేస్తూ
నేలకు వెలుగుల అభయమిస్తూ
గగన వీధిని పరుగులు పెడుతూ
భువనానికి చైతన్యం కలిగిస్తూ...
అరుదెంచి అందరి క్షేమం కోరే
ఆదిత్యుని అరుణరథం
అఖిలజగాలను అప్రహతిహతంగా
నడిపించును ప్రగతిపథం
అరుదైన అందాలు
అంబరాన ఆవిష్కరించే
అరుణోదయ శుభవేళ
ఆనందించని ఎడద వుండదీ ఇల
వరమంటి ఘనమైన
దీవెనలిస్తూ...
ఇడుమున నడిపించు
తోడుగ వుంటూ
అనువైన మార్గాన
పయనింపచేస్తూ..
గమ్యానికి చేరువగా
చేర్చాలని
జగహితం కోసం వచ్చే
జగన్నాధునికి అంజలి ఘటిస్తూ
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి