నీ ఓర్పే ఓదార్పు నీకు
నీ గమనం సాగాలి ముందుకే!
నీ మనసే మిత్రుడు నీకు
నీ పయనం సాంతం నీదే!
గాయాలకు మరపే మందు
గతాన్ని మరి మరీ తలవకు
ఏ మాత్రం మార్చలేని దానికై
మారక తప్పదు నీవే మరవకు
తిరస్కరించబడ్డ చోటే
పురస్కారం పొందాలి
అవమానించబడ్డ చోటినుండే
ఆహ్వానం అందుకోవాలి
ఏ కష్టం నీవు పడాలో
ఏ మెట్లు అధిరోహించాలో
ఏ దారిని సాగాలో
మధనం నీ మదిలో జరగాలి
అనవసర అభిజాత్యాలు
అనర్థదాయకాలని
ఆలోచనలో పరిణితి
సాధించి తీరాలి..
అడుగుకు మరో అడుగు
తోడుగా
ఆలోచనకు ఆచరణ
నీడగా
అలుపుకు ఉత్సాహం
ఊపిరిగా
ఆగక పయనం సాగాలి
నీకు నీవే రాజువంటూ
నిప్పు నీవే రాజేసుకుంటూ
తప్పు దొరకని తీరుగా
ఒప్పుగా నడత ఉండాలి.
ఉదయమొక ఊతంగా
కొత్త ఊపిరిపోసే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి