తీయనిపలుకులు
చెబుతా
మాటలముద్రను
వేస్తా
పకపకనగవులు
చిందుతా
నవ్వులముద్రను
వేస్తా
పువ్వులజల్లులు
వెదజల్లుతా
ప్రేమముద్రను
వేస్తా
పన్నీటిచుక్కలు
చల్లుతా
పరిమళముద్రను
వేస్తా
చక్కనివేషము
కడతా
అందాలముద్రను
వేస్తా
సుఖసౌఖ్యాలు
కలిగిస్తా
ఆనందముద్రను
వేస్తా
మధురభక్ష్యాలు
తినిపిస్తా
తీపిముద్రను
వేస్తా
ఊహలడోలికలో
ఊపుతా
భావముద్రను
వేస్తా
కవితావానను
కురిపిస్తా
కవిముద్రను
వేస్తా
అక్షరముద్రలు
అందుకోండి
సాహిత్యముద్రలు
వేసుకోండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి