40 మందికి దీపావళి పురస్కారాలు

 సురభి ఆధ్యాత్మిక  అమృతవాహిని  తరంగాల సమూహ సభ్యులందు ఆధ్యాత్మిక తత్వంలో విశిష్ట సేవలనందిస్తున్న వారికి శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ అభినందిస్తూ ప్రత్యేక పురస్కారాలను ప్రకటించారు. అలాగే ఇటీవల వరద బాధితులకు మిక్కిలి చేయూతనిచ్చిన సేవకులకు, ఉపాధ్యాయ రంగంలో ఘనమైన సేవలనందిస్తూ, కృషి చేస్తున్న జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావుకు,    మొత్తం 40మందికి దీపావళి సందర్భంగా శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాలను ప్రకటించింది. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. కుప్పిలి కీర్తి పట్నాయక్, తదితరుల చేతులమీదుగా త్వరలో ఈ పురస్కార ప్రదానం చేయనున్నారు.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice