పుస్తక పఠనము శ్రేష్టము;- -గద్వాల సోమన్న,9966414580
ఎంతైనా మంచిది
పుస్తకాల పఠనము
దొరుకునోయ్! వినోదము
పెరుగునోయ్!వికాసము

త్రుంచును అజ్ఞానము
పంచును విజ్ఞానము
నెమ్మది ప్రసాదించు
హృదయము సంతసించు

పయనమున తోడుగా
ప్రాణ స్నేహితుడుగా
ఉండునోయ్! పుస్తకము
వెలిగించు మస్తకము

తెలుపునోయ్! విషయాలు
కలుపునోయ్! హృదయాలు
చదివితే పుస్తకాలు
మారును జీవితాలు

విలువైన పుస్తకము
చదవాలి అనుదినము
కావాలి ఆసక్తి
పెరగాలి అనురక్తి

హస్త భూషణము నాడు
చరవాణి కదా! నేడు
ఏది ఏమైనా ఇక
పుస్తకం చదివి చూడు

అతిశ్రేష్టము పఠనము
చేసుకోకు వ్యర్థము
యోచించు!తక్షణము
లేదంటే నష్టము

గురుదేవులు పొత్తము
సరిచేయును చిత్తము
నిర్లక్ష్యం చేయకు
బ్రతుకున ఏమాత్రము


కామెంట్‌లు