సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-636
భ్రమర కీట న్యాయము
*****
 భ్రమరము అంటే నల్ల తుమ్మెద. కీటము అంటే కీటకము లేదా పురుగు.
తుమ్మెద  ఓ పురుగును పట్టుకొని వచ్చి తన గూటిలో  పెట్టుకుని దానిని చంపకుండా దాని చుట్టూ తిరుగుతూ ఝుంకారం అనే ధ్వని చేస్తుందట.అదే పనిగా   తుమ్మెద చేసే ఝుంకారం వింటూ వింటూ కొంత కాలానికి ఆ పురుగు కూడా  తుమ్మెదగా  మారుతుందనే అర్థంతో ఈ" భ్రమర కీట న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే తెలుగులో మనవాళ్ళు "ఆరునెలలు కలిసి తిరిగితే వారు వీరవుతారు" అనడం వింటుంటాం.
మరి ఈ న్యాయానికి సంబంధించిన  పద్యాన్ని చూద్దాం
కీటకము దెచ్చి భ్రమరము/ పాటవమున  బంభ్రమింప భ్రాంతంబైత/త్కీటము భ్రమరరూపము/ బాటించి వహించు గాదె భయ యోగమునన్"
అంటే తుమ్మెద  ఓ కీటకాన్ని  తనతో తెచ్చుకుని దానికి తన ఝుంకార నాదాన్ని శిక్షణగా నేర్పుతుంది. అది తన చుట్టూ తిరిగేటప్పుడు మొదట అది శిక్ష  అనుకుని భయపడుతుంది. ఆ తర్వాత ఏకాగ్రతతో ఆ నాదాన్ని వింటూ తాను కూడా ఝుంకారం చేసే భ్రమరంగా మారిపోతుందని అర్థము.
అల్లసాని పెద్దన గారు తాను రాసిన మను చరిత్రలో  ఈ  న్యాయాన్ని ఉపయోగించడం విశేషం.ఆ సందర్భమేమిటో చూద్దామా....
వరూధిని గంధర్వ కాంత.ఆమె సహజంగానే దైవ లక్షణాలు కలిగి ఉంది.అలాంటి  ఆమె ప్రవరుడు ఐన మనుష్యుణ్ణి ధ్యానిస్తూ ,పరవశయై తన యొక్క సహజ లక్షణాలు కోల్పోయింది.
"యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ అనే ధర్మం వల్ల ఆ సమయంలో మానవ కాంత అయిపోయిందని వర్ణించాడు.
"అనిమేష స్థితి మాన్చె బిత్తరపు చూపస్వేదతా వృత్తి మా/న్చె నవ స్వేద సమృద్ధి,బోధ కళ మాన్చెన్ మోహ విభ్రాంతి తో/ డనె గీర్వాణ వధూటికిన్ భ్రమర కీట న్యాయమొప్పన్ మను/ష్యుని భావించుట మానుషత్వము మెయిన్ జూపట్టెనాత్తరిన్ "
వరూధిని ప్రవరాఖ్యుడిని బిత్తర చూపులు చూస్తూ రెప్ప పాటు లేని దేవతా లక్షణాలు పోగొట్టుకుంది. వాళ్ళలా చెమట పట్టని స్థితి నుండి మారడంతో ఆమెకు ఒళ్ళంతా చెమట పట్టింది. దేవతలకు ఉన్న త్రికాల జ్ఞాన స్థితిని కోల్పోయింది...కారణం మానవున్ని  భావించడం, ధ్యానించడం,ఉపాసించడం వల్ల.. అదెలా అంటే "భ్రమర కీట న్యాయము"లా అని  రాస్తాడు.
దీనినే ఆధ్యాత్మిక దృష్టితో   చూసినట్లయితే...
 ఏ పనైనా సరే ఏకాగ్రత,తదేకమైన ఆలోచన, మనల్ని మనం మరచిపోయి అందులో పూర్తిగా నిమగ్నమైతే ఆ కార్యాన్ని సులభంగా పూర్తి చేయగలం.
భ్రమర కీట న్యాయములో కీటకము భ్రమరమునే ధ్యానిస్తూ,చింతన చేస్తూ చివరకు భ్రమరాకారము పొందుతుంది.
అలాగే ఆత్మ జ్ఞాన ప్రాప్తి పొందాలంటే తీవ్రమైన సాధన చేయాలి.మనసును నిష్ఠ  ఏకాగ్రత కలిగి వుండేలా  చేసినట్లయితే తప్పకుండా  మోక్ష సిద్ధి కలుగుతుందనీ. తన శక్తిని, యుక్తిని బలమును నిష్ఠను దృశ్య స్థితి నుండి ఆత్మ స్థితికి మరలిస్తే తప్పకుండా అనుకున్న మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
 ఈ విధంగా  భ్రమర కీట న్యాయమును  విద్యార్థి గురువుకు కూడా అన్వయించవచ్చు.
ఉత్తమ గురువు మాటలను, బోధనలను భయం,భక్తి, శ్రద్ధలతో, తదేకంగా  వినడం వల్ల భవిష్యత్తులో తాము కూడా ఉత్తమ గుణాలున్న గురువులుగా మారడం మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి వారిని కొందరిని చూస్తూ ఉంటాం . అలా చూసినప్పుడు   ఎవరికైనా"భ్రమర కీట న్యాయము" అనేది ఎవరికైనా సరే తప్పకుండా గుర్తుకు వస్తుంది.
కీటము భ్రమరముగా మారడం  ఎలాగో చూద్దాం. 
తుమ్మెద  ఓ పురుగును పట్టుకొని వచ్చి తన గూటిలో  పెట్టుకుని దానిని చంపకుండా దాని చుట్టూ తిరుగుతూ ఝుంకారం అనే ధ్వని చేస్తుందట.అదే పనిగా   తుమ్మెద చేసే ఝుంకారం వింటూ వింటూ కొంత కాలానికి ఆ పురుగు కూడా  తుమ్మెదగా  మారుతుందనే అర్థంతో ఈ" భ్రమర కీట న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
దీనినే తెలుగులో మనవాళ్ళు "ఆరునెలలు కలిసి తిరిగితే వారు వీరవుతారు.వీరు వారవుతారు" అనడం వింటుంటాం.
మరి ఈ న్యాయానికి సంబంధించిన  పద్యాన్ని చూద్దాం
కీటకము దెచ్చి భ్రమరము/ పాటవమున  బంభ్రమింప భ్రాంతంబైత/త్కీటము భ్రమరరూపము/ బాటించి వహించు గాదె భయ యోగమునన్"
అంటే తుమ్మెద  ఓ కీటకాన్ని  తనతో తెచ్చుకుని దానికి తన ఝుంకార నాదాన్ని శిక్షణగా నేర్పుతుంది. అది తన చుట్టూ తిరిగేటప్పుడు మొదట అది శిక్ష  అనుకుని భయపడుతుంది. ఆ తర్వాత ఏకాగ్రతతో ఆ నాదాన్ని వింటూ తాను కూడా ఝుంకారం చేసే భ్రమరంగా మారిపోతుందని అర్థము.
అల్లసాని పెద్దన గారు తాను రాసిన మను చరిత్రలో  ఈ  న్యాయాన్ని ఉపయోగించడం విశేషం.ఆ సందర్భమేమిటో చూద్దామా....
వరూధిని గంధర్వ కాంత.ఆమె సహజంగానే దైవ లక్షణాలు కలిగి ఉంది.అలాంటి  ఆమె ప్రవరుడు ఐన మనుష్యుణ్ణి ధ్యానిస్తూ ,పరవశయై తన యొక్క సహజ లక్షణాలు కోల్పోయింది.
"యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ అనే ధర్మం వల్ల ఆ సమయంలో మానవ కాంత అయిపోయిందని వర్ణించాడు.
"అనిమేష స్థితి మాన్చె బిత్తరపు చూపస్వేదతా వృత్తి మా/న్చె నవ స్వేద సమృద్ధి,బోధ కళ మాన్చెన్ మోహ విభ్రాంతి తో/ డనె గీర్వాణ వధూటికిన్ భ్రమర కీట న్యాయమొప్పన్ మను/ష్యుని భావించుట మానుషత్వము మెయిన్ జూపట్టెనాత్తరిన్ "
వరూధిని ప్రవరాఖ్యుడిని బిత్తర చూపులు చూస్తూ రెప్ప పాటు లేని దేవతా లక్షణాలు పోగొట్టుకుంది. వాళ్ళలా చెమట పట్టని స్థితి నుండి మారడంతో ఆమెకు ఒళ్ళంతా చెమట పట్టింది. దేవతలకు ఉన్న త్రికాల జ్ఞాన స్థితిని కోల్పోయింది...కారణం మానవున్ని  భావించడం, ధ్యానించడం,ఉపాసించడం వల్ల.. అదెలా అంటే "భ్రమర కీట న్యాయము"లా అని  రాస్తాడు.
దీనినే ఆధ్యాత్మిక దృష్టితో   చూసినట్లయితే...
 ఏ పనైనా సరే ఏకాగ్రత,తదేకమైన ఆలోచన, మనల్ని మనం మరచిపోయి అందులో పూర్తిగా నిమగ్నమైతే ఆ కార్యాన్ని సులభంగా పూర్తి చేయగలం.
భ్రమర కీట న్యాయములో కీటకము భ్రమరమునే ధ్యానిస్తూ,చింతన చేస్తూ చివరకు భ్రమరాకారము పొందుతుంది.
అలాగే ఆత్మ జ్ఞాన ప్రాప్తి పొందాలంటే తీవ్రమైన సాధన చేయాలి.మనసును నిష్ఠ  ఏకాగ్రత కలిగి వుండేలా  చేసినట్లయితే తప్పకుండా  మోక్ష సిద్ధి కలుగుతుందనీ. తన శక్తిని, యుక్తిని బలమును నిష్ఠను దృశ్య స్థితి నుండి ఆత్మ స్థితికి మరలిస్తే తప్పకుండా అనుకున్న మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
 ఈ విధంగా  భ్రమర కీట న్యాయమును  విద్యార్థి గురువుకు కూడా అన్వయించవచ్చు.
ఉత్తమ గురువు మాటలను, బోధనలను భయం,భక్తి, శ్రద్ధలతో, తదేకంగా  వినడం వల్ల భవిష్యత్తులో తాము కూడా ఉత్తమ గుణాలున్న గురువులుగా మారడం మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి కొందరిని చూస్తూ ఉన్నప్పుడు  ఈ "భ్రమర కీట న్యాయము" ఎవరికైనా సరే తప్పకుండా గుర్తుకు వస్తుంది.

కామెంట్‌లు