గద్వాల సోమన్న "కాంతి కిరణాలు" పుస్తకావిష్కరణ

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన  "కాంతి కిరణాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం వాల్మీకి సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో  పద్మశ్రీ డా.కొలుకలూరి ఇనాక్, అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ,ప్రఖ్యాత పద్య నాటక కళాకారులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ,విశ్రాంత దూరదర్శన్ డైరెక్టర్ శ్రీ ఓలేటి పార్వతీశం,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి డా.శ్రీ వి.డి. రాజగోపాల్, విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.ఎల్.కృష్ణారెడ్డి,కళారత్న శ్రీ బిక్కి కృష్ణ  విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఘనంగా జరిగింది.అనతి కాల వ్యవధిలో 58పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం(సత్యభామ అలకసీను)నాటకం సాంబశివారెడ్డి, రత్నశ్రీ లచే ప్రదర్శింపబడింది. కార్యక్రమంలో అతిరతిమహారథులు, ఉపాధ్యాయులు శ్రేయోభిలాషులు, సాహితీమిత్రులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
కామెంట్‌లు