తొలిసంధ్యలో వెలువడే
తొలికిరణం సూటిగా
తొలుత తాకిన తరుణం
తొలకరిలా మురిసే అవని
తనువంతా చైతన్యం
తరగల్లే పాకుతుంటే
తళతళ మెరుపులతో
తడిసి మురిసిపోవు ధరణి
తరలివచ్చు వెలుగులను
తనివితీర స్వాగతించి
తలుపుతీసి తనివారగ
తల్లిలాగా ఆదరించు పృధ్వి
చరాచర జగత్తుకు జీవమిచ్చి
చక్కగా పోషించి పెంపుచేసి
చతుర్దిశలు ప్రకాశింప
చిలికించు వన్నెలు నవ్యంగా ధాత్రి
వాడిపోయిన మోడులైన
వాడుకగా చిగురించి
వాడనెల్ల శోభలతో నింపు
వాత్సల్యం చూసి మురిసె మేదిని
నింగి లోని మబ్బులన్నీ
రంగులతో తానమాడి
వంగి వంగి వందనమంటూ
తొంగి చూడ ధన్యనంటున్న ధరిత్రి
వసుమతిని సుగతిని నడిపే
భూమిని భగవంతుడై కాచే
ఇలాతలము ఇంపుగ వర్ధిల్లచేయ
అల ఆకసాన ఏతెంచు ఆదిత్యునికి
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి