సుప్రభాత కవిత ; - బృంద
గమ్యం చేరే రోజెపుడో
తెలియని పయనం
ధైర్యం తోడుగ సాగాలి
రారెవ్వరు తొడు నిరంతరం

కష్టం వస్తే కంగారే!
నష్టం వస్తే బేజారే!
ఇష్టం వస్తే సరదానె!
వరసేదైనా అది నీదేలె!

వేడుక నలుగురితో
వేదన  మనసుతో
యుధ్ధం కనిపించని శత్రువుతో!
సిధ్ధం కావాలి సహనంతో!

భయంతో చెలిమి వద్దు
సాయం దొరకుట కద్దు
నెయ్యం మంచిది అందరితో
కయ్యం ముప్పే కొందరితో

సాధ్యం అయితే అదృష్టం
చేయిజారితే అనుభవం
చదవక నేర్చే పాఠాలు
అడగక వచ్చే సలహాలు

పచ్చగ వుండే తరుణంలొ
కచ్చగ వుండకు లోకంపై
ఇచ్చుట తెలిసిన మనసును
మెచ్చును దైవం మరువకు

కలిసే ఉన్న బంధాలన్నీ
కడవరకూ కలిసిరావు
ఇది తెలిసి మసిలితే
వెలిసే వేదనలే అన్నీ!

కలవని  పట్టాలు
కనిపించని చెట్టపట్టాలు
తెలియని తీరాలకు
చేర్చును బ్రతుకుబళ్ళు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు