అన్నాదమ్ముల వ్యాపారం;- బి శిరీష - రామరాజుపల్లి
 అనగనగా ఒక గ్రామంలో రాము,లక్ష్మణ్ అనే అన్నదమ్ములు వున్నారు. వారికి సమానమైన మామిడి తోటలు వున్నాయి. వారికి మామిడి కాయల బేరం చేస్తే కానీ పూట గడవదు.రోజు మామిడి కాయల బేరం చేస్తూనే వుంటారు. అలాగే ఒక రోజు బేరంకు వెళ్లారు. మామిడి కాయలమ్మ ,మామిడి కాయలు అని అమ్ముతూ వుంటారు. అప్పుడు ప్రజలు మామిడి కాయలను కొనడానికి వచ్చి అందరు అబ్బో! ఈ మామిడి కాయలు బలే వున్నాయే అని అందరూ రాము దగ్గరకే వెళ్లి మామిడి కాయలను తీసుకొని వెళ్తారు. అప్పుడు రాముకే అక్కువ బేరం వస్తుంది. అప్పుడు లక్షణ్ ఆచార్య పోతాడు. ఎంటి అన్నా నా మామిడి కాయలకన్నా నీ మామిడి కాయలు చాలా పెద్దగా కాసాయ్ అని ఆచార్య పోతాడు అలా ఎలా అన్నా అని అంటాడు. నేను మామిడి కాయలు పెద్దగా కాయడానికి నేను ఒక పౌడర్ ని చెల్లుతున్నను అందుకే చాలా పెద్దగా తియ్యగా కోస్తున్నాయి అని అంటాడు. అవునా అన్నా ఆ పౌడర్ ఏదో జర నాకు చెప్పు అన్నా నేను కొంచం వేస్తా అని అంటాడు. అలా అనడంతో సరే తమ్ముడు ఇగో ఇదిగో తీసుకో తమ్ముడు అని అంటూ ఇది రోజుకు ఒక మూత మాత్రమే వెయ్యలీ అక్కువ  వేస్తే తోట మొత్తం పడవుతుంది అని అంటాడు.  ఆ సరే అన్నా అని అంటూ వెళ్తాడు. తోట దగ్గరకు వెళ్ళి ఒక మూత పౌడర్ ను తోట కి మొత్తం వచ్చేలా చల్లుతాడు .మళ్లీ మరుసటి నాడు వచ్చి చూస్తే మామిడి కాయలు చాలా పెద్దగా కాస్తాయ్. అది చూసిన లక్ష్మణ్ అబ్బో! మామిడి కాయలు చాలా పెద్దగా కాసాయే చాలా బాగున్నాయి అని ఎగిరి గంతులు వస్తాడు. మళ్లీ ఒక్క రోజు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి మామిడి వెళ్లారు.మామిడి కాయలమ్మ ,మామిడి కాయలు అని అంటూవుండగా అందరు వచ్చి చకచకా తీసుకొని వెళ్తారు. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు సంతోషంగా వుంటారు . వమ్మే ఒక మూత పోస్తేనే అన్ని మామిడి కాయలు కోస్తున్నది ఇంకో మూత పోస్తే చాలా వస్తుంది మా అన్న కంటే ఎక్కువ బేరం నాకే రావాలి అని అలా రోజు రోజుకి ఒక్క మూతను ఎక్కువ కలుపుతూ పోస్తాడు.అప్పుడు రాము కి అనుమానం వచ్చి ఏంటి తమ్ముడు మామిడి కాయలు బాలే కోస్తున్నది       ఎమైన పౌడర్ ను ఎక్కువ కానీ కలుపుతున్నావా అని అడుగుతాడు.అలా ఏం లేదు అన్న నేను ఒక మూతను మాత్రమే కలుపుతూన్నా అని అంటాడు. ఓహో అవున అది ఎక్కువ కలపకు అని చెప్పి వెళ్తూంటాడాడు. అమ్మో మా అన్నకి నేను ఏదుగుతున్నా అని చాలా కుళ్లు వుంది మా అన్నకి అని అనుకుంటడు.కావాలనే పౌడర్ని చల్లకు అని అంటుండేమె అని కలుపుతూ వుంటాడు. అలా కొన్ని రోజులకు మామిడి తోట అంత ఎండిపోతుంది. లక్ష్మణ్ పొద్దున మామిడి తోటకి  వచ్చి చూడగానే మామిడి తోట అంత ఎండి పోతుంది అది చూసిన లక్ష్మణ్ చాలా ఆచార్య పోతాడు. అయ్యా ఏంటి ఇలా ఐనది అని అక్కడే కుప్పకూలి పోతాడు. అప్పుడే రాము మామిడి తోటకు వస్తుండగా లక్ష్మణ్ అలా బాధ లో వుండటం చూసి దగ్గరకు వెళ్లి ఏం ఐనది లక్ష్మణ్ అలా బాధగా వున్నావ్ అని అంటూ వుండగా. అప్పుడు లక్ష్మణ్ ఏడుస్తు నికన్నా         ఎక్కువ సంపాదించాలి అని నువ్వు ఇచ్చిన పౌడర్ ను రోజు రోజుకు ఎక్కువ కలిపి పోసాను అన్న అని బాధగా అంటాడు. అప్పుడు రాము మనిషికి ఆశ
వుండాలి కాని మరీ అత్యాషా వుంటే మనతో పాటు మన చుట్టూ వున్న అన్ని పడవుతాయ్ అని అంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఎరువుల తో తయారు చేసి కొత్త మామిడి తోటను మొదలు పెడుతారు
         


కామెంట్‌లు