నవ్వుతూ బ్రతకాలిరా - 4:-సి.హెచ్.ప్రతాప్
 (1) మీరిద్దరూ మొగుడూ పెళ్ళాలంటే నమ్మ బుద్ధి కావడం లేదు. అసలు సంగతి చెప్పండి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు" లాడ్జిలో రైడింగ్ చేస్తుండగా పట్టుబడిన ఒక జంటను గద్దించి అడిగాఘు ఎస్.ఐ మీసాల్రావ్.
 
" మాది ఈ ఊరేనండి బాబు. మా ఆయనకు నేను పెళ్ళాన్ని. పక్కింటి పెళ్ళానికి ఈయన మొగుడు.మమ్మల్ని మొగుడు పెళ్లాలనే అంటారు కదా" అసలు సంగతి లాజికల్ గా చెప్పింది పెల్లాం.
(2) ఒక ప్రభుత్వ కార్యాలయం ముందు ఒక బోర్డుపై ఈ విధం గా రాసి వుంది- " దయచేసి గట్టిగా మాట్లాడకండి".
ఫైళ్ళపై సంతకం కోసం చెప్పులరిగేలా తిరిగిన ఒక వ్యక్తి చివరకు విసుగెత్తి కొన్ని పదాలను ఈ విధం గా ముందు చేర్చాడు- " మేము నిద్ర పోతున్నాం" .
(3) నర్సమ్మా ! పోస్ట్ మార్టం లో ప్రాక్టికల్స్ కోసం నాలుగు బాడీలను రేపు పన్నెండింటి కల్లా సప్లయి చేస్తామని ఆ మెడికల్ కాలేజీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు” అన్నాడు డాక్టర్ దైవాధీనం
“అదెలా సాధ్యం సార్ ?” అడిగింది నర్స్.
“ రేపు  ఉదయం మనకు నాలుగు ఆపరేషన్లు వున్నాయి కదా ! మధ్యాహ్నం కల్లా ఆ బాడీలను వాళ్ళకు ఇచ్చెయ్యవచ్చు”  అసలు సంగతి చెప్పాడు డాక్టర్.
(4)" ఆడవాళ్ళ దగ్గర  ఆచి తూచి మాట్లాడాలిరా !:
“ ఏమయ్యింది ?”
“ ఆ మధ్య కోపంలో  నువ్వు చాలా అందంగా వుంటావని మా ఆవిడతో జోక్ చేసా! అప్పటి నుండి ఇరవై నాలుగు గంటలూ కోపంగా వుంటోంది. ఆ ముఖం చూడలేక చస్తున్నా”


కామెంట్‌లు