సాధారణంగా మనల్ని ఎవరైనా ఏదైనా చిన్న సాయం అడిగితే చేస్తాం.కానీ ఈరోజుల్లో అది కరువైంది.సీనియర్ సిటిజన్స్ బస్సు ఎక్కితే లేవకుండా అమ్మాయిలు స్మార్ట్ ఫోన్ చూస్తూ గడుపుతారు. నోరు తెరిచి అడిగినా పెదవి కదపరు. మొహం తిప్పేసుకుంటారు. కాస్త అబ్బాయిలు మెరుగు.రోజూ మెట్రో రైల్లో బస్సులో వచ్చే నడివయసు మహిళల గోడు పట్టించుకోరు. కండక్టర్ మాటను కూడా పెడచెవిన పెడతారు.పూణేకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డేవిడ్ గాంధీ భార్య తో కలిసి మణిపూర్ లోని అబెన్ అనే కొండప్రాంతం లోని పల్లెలో స్కూల్ పెట్టారు.అక్కడున్న రైతులకు స్లోపింగ్ పద్ధతి లో వ్యవసాయంలో శిక్షణ ఇచ్చారు. రకరకాల కూరలు పండ్లు ఇప్పుడు అక్కడ పండిస్తూ రైతులు ఖుషీగా ఉన్నారు. 70 ఏళ్లు దాటిన కోల్కతా డాక్టర్ అరుణోదయ్ వారానికోసారి 200కి.మీ.దూరంలో ఉన్న సుందర్బన్ ప్రజలకోసం వెళ్లి వైద్యం చేస్తాడు. రోగుల సంఖ్య పెరగటంతో క్లినిక్ ఏర్పాటుచేశారు.6గంటలు ప్రయాణంచేస్తూ కోల్కతా నుంచి వెళ్లడం ఓఎత్తు ఐతేఆదివారం వృద్ధులు దివ్యాంగులున్న ఇళ్లకు వెళ్లి వైద్యంచేయడం చెప్పుకోవలసిన విశేషం.100పల్లెలకు రోడ్లు కరెంట్ స్కూల్స్ ఏర్పాటుచేసిన ఆయన పద్మశ్రీ గ్రహీత. పోస్టల్ శాఖలో చిరుద్యోగంచేసి రిటైరైన గగన్ పైతల్ భువనేశ్వర్ కి చెందిన వారు.భార్య అన్నపూర్ణ తో కలిసి పల్లెల్లో బీదబిక్కీకి తను సేకరించిన బట్టలు వస్తువులు ఇచ్చివస్తాడు. 10 ఏళ్లుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నాడాయన. చెప్పులు ఆటబొమ్మలు బ్యాగులు సేకరించి కావల్సిన వారికివ్వడంకోసం వాహనంలో నెలకోసారి వెల్తాడు.🌹
స్ఫూర్తిప్రదాతలు 57 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి