(1)" ఈ సబ్బు వాడితే మురికి పోయి శుభ్రం గా అవుతుందని చెప్పావు. ఎంత అరగదీసినా ఈ షర్టు కున్న మురికి పోలేదు చూడు” కోపంగా షర్టును విసిరి కొట్టి అరిచాడు సుబ్బారావు.
“ ఎక్కువగా అరవకండి సార్ బి పి పెరిగి పోగలదు. నేనన్నది మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు ! మురికి షర్టుకు పోతుందని ఎప్పుడు చెప్పాను ? ఈ సబ్బును చూడండి, ఎలా తళ తళ లాడుతుందో ?” తాపీగా అసలు సంగతి చెప్పాడు షాపు వాడు.
(2)“ఏమిట్రా వాంతులకు విరేచనాలకు అన్నేసి బిళ్ళలు కొనుక్కెళుతున్నావు ? ఇంట్లో ఎవరికి ఏమయ్యింది ? అడిగాడు వెంకట్రావు.
“ ఎవరికీ ఏమీ అవకూడదనే వీటిని తీసుకెళ్ళుతున్నాను. నిన్నటి నుండి మా ఆవిడ కవితలు రాసి మాకు వినిపించడం మొదలెట్టింది. కాస్త ముందు జాగ్రత్త అవసరం కదా” అసలు సంగతి వివరించాడు నాగేశ్వరరావు.
(3)“ డాక్టరు గారు. ఒళ్ళంతా నొప్పులుగా వుంది, అప్పాయింట్ మెంటు తీసుకోలేదు, కాస్త పరీక్ష చెయ్యరా ?” అందరినీ తోసుకొని గదిలోకి వచ్చి అడిగింది ఇరవై ఏళ్ళ రేఖ.
“ ఓకె, కాస్త బట్టలు వదులు చేసి ఆ టేబిల్ మీద పడుకొండి” చెప్పాడు విజయ్ రేఖ అందాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ.
“ నొప్పులు నాకు కాదు సార్, మా అమ్మగారికి”
“ సారి. ఇప్పుడు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం కుదరదు. సాయంత్రం తీసుకు రండి” చికాకుగా అన్నాడు విజయ్.
(4) . “ఏవడే ఆ చుంచు మొహం గాడు ? మీసాలు, గెడ్డాలు కూడా లేకుండా కోతిలా వున్నాడు. వాడి వెధవ ముఖానికి సైటు కొట్టడం ఒకటి. చూడు మనల్నే ఎలా చూస్తున్నాడో ? “ ఈసడింపుగా అంది రేఖ.
“ ఓహ్, అతనా ! అతను నాకు అన్నయ్య వరస అవుతాడులే. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయలు జీతం.శెలవల కోసం నిన్నే ఈ ఊరొచ్చాడు” అసలు సంగతి చెప్పింది రాధ.
“ ఓహ్ గ్రేట్, ఎంత అందమైన పెర్సనాలిటీనో, షారూఖ్ ఖాన్ కూడా ఇతని ముందు దిగదుడుపే, కంప్లీట్ షేవింగ్ లో ఇంకా సూపెర్బ్ గా వున్నాడు.కాస్త పరిచయం చెయ్యవే బాబూ , నీకు పుణ్యం వుంటుంది” బ్రతిమిలాడసాగింది రేఖ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి