స్ఫూర్తిప్రదాతలు 60:- సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 వ్యవసాయం కూరగాయలను పండించినా రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోతున్న రోజులివి.కానీ ఢిల్లీకి చెందిన సుమన్ సుఖీజా ఇంట్లోనే కార్డిసెప్స్ అనే మష్రూం పుట్టగొడుగులను పెంచుతూ ఏడాదికి 30లక్షలు సంపాదిస్తోంది. హిందీలో కీడాజడీ అనిపిల్వబడేఔషధగుణాలున్న దీన్ని గూర్చిన శిక్షణ ను హర్యానా లోని మురథల్  కృషివికాసకేంద్రంలో శిక్షణ తీసుకున్నదామె. తమ ఇంట్లో ఓగదిలో 4లక్షలతోచిన్న లాబ్ ఏర్పాటుచేసింది.థాయిలాండ్ నుంచి కల్చర్ తెప్పించి దీన్ని పెంచింది.కిలో ధర 93 వేలతో దీన్ని అమ్ముతోంది. దీని జీవిత కాలం చాలా ఏళ్లుకావడంతో ఎన్నోరకాలరోగాలకు రామబాణంలాగా పనిచేస్తోంది.చాలామందికి శిక్షణ ఇస్తోంది.కార్డిసెప్స్ మష్రూం ఆరోగ్య దాయిని అని తెలుస్తోంది.14వ ఏటనే ధనుజా కుమారికి పెళ్లైంది. అమ్మ నాన్నల మధ్య గొడవలు కొట్లాటలతో చెత్త ఏరుతూ బతికే ఆపిల్లని కాన్వెంట్లో నన్స్ ఆదరించారు. 9వక్లాస్ దాకా చదివింది.కేరళలోని కొల్లం కాన్వెంట్ లో నన్స్ ప్రోత్సాహంతో రోజూ మంచి చెడు చేసిన పనులు   రాయడం 4వక్లాస్ లోనే ప్రారంభించిన ఆపిల్లలో రచనాశక్తి మొలకెత్తి ఇప్పుడు పుస్తకంగా వెలువరించింది.ఆపుస్తకం "శ్చెంగల్చూలా" కన్నూర్ యూనివర్శిటీ లో బి.ఎ.పాఠ్యాంశంగా కాలికట్ యూనివర్శిటీలో ఎం.ఎ.పాఠ్యాంశంగా ఉంది. ఆమె ఇప్పడు కూడా హరితకర్మసేనలో సభ్యురాలు.పైగా అంబాలాముక్కూ లోని రవినగర్ లో ఇప్పటికీ చెత్త సేకరణ పనిలోనే వృత్తిని కొనసాగిస్తోంది🌹
కామెంట్‌లు