స్ఫూర్తిప్రదాతలు 64 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 పేదలు ఆదివాసీలకు చదువు చెప్తున్న ఇద్దరు వ్యక్తులను గూర్చితెల్సుకుందాము.పశ్చిమ బెంగాల్లో ఈచైతన్యంకి కారకుడు దీప్ నారాయణ్. ఇతని తండ్రి కూలీ.9మంది ఉన్న కుటుంబం.దీప్ 10వక్లాస్ దాకా పుస్తకాలు యూనిఫాం ని ఎవరైనా దానం చేసినవి వేసుకుని చదివాడు.ఆపై తనుకూడా కూలీ గా డబ్బు సంపాదించేవాడు.సాయంత్రం ట్యూషన్ చెప్పేవాడు.అతని ప్రతిభ ను గమనించిన ఓదయాళువు ఇంటర్ చదివించాడు. స్కాలర్ షిప్ తో  బి.ఎస్సీ.చదివిటీచర్ ట్రైనింగ్ ఐనాక బడిలోప్రతినెలా ఇద్దరు విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాంకొనేవాడు. ఆతర్వాత గ్రామంలో బీదలకు ఇంటికెళ్లి బ్లాక్ బోర్డు ఏర్పాటుచేసి పిల్లల అమ్మ నాన్నలకు అవ్వతాతలకు కూడా చదువునేర్పసాగాడు.ప్రస్తుతం 7జిల్లాల్లో10వేలమంది పైగా లబ్ధిపొందారు. వీధిమాస్టార్ ఉద్యమం అనిపిలుస్తారు.ఇకకేరళకి చెందిన దామోదరన్  9దాకా చదివి కూలీగా మారాడు.ఇసుకబట్టీలో పనిచేశాడు.తల్లిప్రోత్సాహంతో డిగ్రీ చదివాడు.తల్లి చనిపోటం తండ్రి అనారోగ్యంతో ఉన్నా అలాగే చదువుకున్నాడు.మురికివాడల పిల్లల కి ఇంగ్లీష్ లెక్కలు చెప్తూ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు.ఆదివాసీ పిల్లలకు మాస్టారుగా పనిచేశాడు.480కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఐదోక్లాస్ పిల్లల కుట్యాబ్ లు ఇచ్చి పాఠాలు చెప్పాడు.ఆంత్రపాలజీలో డాక్టరేట్ పొందాడు🌹
కామెంట్‌లు