బెళగావి కి చెందిన మహేష్ గవర్నమెంట్ ఆస్పత్రుల లో పండ్లు పంచుతాడు.ఓసారి రూపేశ్ అనే చిన్నారిని చూసి రోజూ వచ్చి పలకరించేవాడు.ఆపిల్లాడు తేరుకోటంతో అనాధాశ్రమంలో చేర్చాలని ప్రయత్నించి విఫలుడై దత్తత తీసుకున్నాడు.అలా 60మంది అనాథలకు ఆశ్రయం ఇచ్చిన మహేష్ సాఫ్ట్వేర్ సంస్థ ను నడుపుతూ ఈఅనాథ ఎయిడ్స్ పిల్లల పాలిట దేవుడైనాడు. 1_5వక్లాస్ దాకా స్కూల్ నడుపుతున్నాడు.బెంగుళూర్ పరిసరాల పిల్లలపాలిటి ఆపద్బాంధవుడు మహేష్.ఆసియాలోనే తొలి పాజిటివ్ కాఫీ ని మొదలుపెట్టిన వాడులక్నో కి చెందిన కలోల్ ఘోష్. ఎయిడ్స్ బాధితులకు ఉపాధి కల్పిస్తున్నాడు.
యువత కివిమానం నడపడం నాలక్ష్యం " అంటాడు కేరళకు చెందిన అగస్టిన్ జోసెఫ్.జెట్ ఎక్స్ అన్న కంపెనీపెట్టి ఆపైలాన్స్ ఏర్ అన్న విమాననిర్మాణసంస్థ ద్వారా అతను అందిస్తున్న శిక్షణ విమానాల్ని 34దేశాలు కొనటం విశేషం! కేరళలో పుట్టిన జోసెఫ్ కి తండ్రి అతని 5వ ఏటనే చనిపోయాడు.మొత్తం 5గురు పిల్లల్ని సాకింది తల్లి.ఎన్.సి.సి.లో చేరి బెస్ట్ క్యాడెట్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను నేషనల్ డిఫెన్స్ ఎకాడమీ లో చేరాడు.వింగ్ కమాండర్ గా రాణించాడు.ఆపై అమెరికా వెళ్లిన జోసెఫ్ హెలికాప్టర్ కంపెనీలో పైలెట్ గా చేరి ఇంత స్థితికి ఎదిగిన అతని కల ఏమంటే భారత్ లో కూడా తన సంస్థ అడుగుపెట్టాలని🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి