జాతీయవిద్యాదినోత్సవం! శుభాకాంక్షలతో! :- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
 1.
అవిద్య అంధకారం !
విద్య వెలుగుల ప్రభాతం! 
జాతీయవిద్య ప్రగతి సాధనం! 
సంక్షేమరథ గమన ఇంధనం! 
విద్య లేకుంటే బతుకు మిథ్య!
2.
మననిరంతర విద్యాభ్యాసం !
అక్షరాంతరజ్ఞానంవిద్యలక్ష్యం !
విద్య వివేకం ప్రసాదించాలి! 
వివేకంతో మనిషి జీవించాలి! 
వివేకవంతులే జాతికే ఖ్యాతి!
3.
చదువు వాచక తపస్సు! 
జ్ఞానోదయం ప్రతి ఉషస్సు! 
నిలవదు అజ్ఞాన తమస్సు! 
చదువుకై తహతహలాడాలి! 
ఆయువుసార్ధకం చేసుకోవాలి !
4.
చదువుతోనే జాతి పురోగతి! 
చదవకుంటే మనిషి అధోగతి!
చదువే లేకున్న శూన్యం జగతి! 
చదువు సంస్కారాల సుతులే!
భరతమాత విశ్వ యశో దీప్తి !
_________


కామెంట్‌లు