గ్రంథాలయవారోత్సవాలు. (నవంబర్ 14- 20)శుభాకాంక్షలతో!=============================================1.నిరంతర గ్రంధాలయోద్యమ, ఉత్సాహ ఉత్సవము!గాడిచెర్ల ఉద్యమాంకితుల,స్మరించే తరుణము!చదువు వాసక తపస్సు, తపోప్రదేశం గ్రంథాలయము!తపః ఫలము నిత్యం ,విజ్ఞాన సముపార్జనము!జ్ఞాన నిలయ ప్రవేశం,జ్ఞానాభివృద్ధి శ్రీకారము!2.చదివినవాడు విజ్జుడు ,చదవని వాడు అజ్జుడు!పఠనాసక్తి పెంచుకునేవాడు, జీవితాన రసజ్ఞుడు!పుస్తకాలు కొని చదవలేని ,వారికి గ్రంథాలయమే దాత!గ్రంధాలయ సముచిత పాత్ర, యువతి యువకుల భవిత!గ్రామాన వెలిసే గ్రంథాలయం, సర్వమతాల దేవాలయము!3.మొదటిదినం బాలల, దినోత్సవం ముదావహం !నేటి బాలలే రేపటి పౌరులు , గ్రంథాలయ ఆశయము!బాల్యాన చదివే అలవాటు వ్యక్తిత్వ వికాసానికి రూటు!ఏడు రోజుల ఉత్సవాలు,ఏడు రంగుల హరివిల్లు!జ్ఞానసప్తస్వరాలై మన ఎద,ఆనందాలు వెదజల్లు!_________
జ్ఞాన నిలయం.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి