మన దీపావళి;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
దివ్యమైన దీపావళి
నవ్యమైన రూపావళి
మన ముందుకు వచ్చింది
ఘన విందును ఇచ్చింది.  !

ఈ దీపావళి నచ్చింది
ఓ శుభావళి హెచ్చింది
ఆ తిమిరావళి సచ్చింది
వెలుగు వెన్నెల వచ్చింది !

వెలుగు జిలుగుల ఈ దీపావళి
తళుకు బెళుకుల ఆ తారవళి
ముస్తాబై మన ఇంటికి వచ్చింది
వస్తాదై ఇక మన కంటికి నచ్చింది !

ఘనమైన మన ఈదీపావళి
జన సాంప్రదాయ రూపావళి
వస్తున్నది మరి మస్తున్నది
వేడుక వెలుగుల దీపిస్తున్నది !

అది అనురాగాలతో స్పందిస్తూ
ఆనందాలను మనకు అందిస్తూ
పరుగున సరుగున వస్తూనే ఉంది
ముదమును మనకు కల్గిస్తానంది.!

తరతరాల ఈ దీపావళి
తరళి తానిక వచ్చింది
తార తోరణాల గుచ్చింది
తీరా కారణాల మెచ్చింది .!

ప్రమిదల వత్తులు వేస్తూ
ప్రస్తుత దీపాల వెలిగిస్తూ
మన దీపావళి ప్రవేశిస్తుంది
ఘన పాపావళి నశిస్తుంది !

వచ్చిన నచ్చిన మన దీపావళి
అందరు మెచ్చిన ఘన శోభావళి
విందు వినోదాలను అందిస్తుంది
అందులో తానెంతో ఆనందిస్తుంది!



కామెంట్‌లు