బ్రతుకు శోకమాయే:- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
ఆకాశంలో మెరుపు మెరిసే
అంతలోనే ఇక వాన కురిసే
తపనతోని నాతనవు తడిసే
మమత తోని మనసు మురిసే !

పగలు పోయి ఇక రేయి వచ్చెను
వగలు సోయితో హాయి హెచ్చెను
ప్రేమ మల్లు ఈతనవునే గిచ్చెను
వలపు తలుపు తెరిచి దారి ఇచ్చెను

తపనతో తనువంతా తడుస్తున్న
రేయంత జాగరణతో గడుస్తున్న
నాపతి రాడాయే ఈడుతో గోడాయే
నాకు రాత్రి అంతా రాపిడే తోడాయే!

తనువు తడి ఆరక కోరిక తీరక
అలసి సొలసి నా మనసే గునిసే
తలపుల మెరుపులే ఇక మెరిసే
తడి పొడి తపనుల వానే కురిసే !

తట్టుకోలేను నేను ఈ విరహం
గుట్టుగా ఉండలేను అహరహం
దేహంలో కలిగేను ఏదో వికారం
మోహానికి చుట్టెను అది శ్రీకారం !

పెదవుల్లో తేనెలు ఊరుతున్నవి
పై యదల్లో పాలిండ్లు కారుతున్నవి
కలయిక సుఖంకై అవి కోరుతున్నవి
తెలియని మైకంలో అవి జోరుగున్నవి!

తడి పొడి తపనలతోని మనసు
సెగల పొగలతోని దోర వయసు
ఆరాటంతో పోరాటం చేస్తున్నాయి
పెనిమిటికై ఎదురుచూస్తున్నాయి !

బుగ్గలు కెంపులై మెరుస్తున్నవి
సిగ్గులు మొగ్గ లేసి అరుస్తున్నవి
ముద్దుల ముద్రలకై వాని ఆరాటం
ముప్పొద్దుల చేస్తున్నవి పోరాటం ! 

నా పెనిమిటి ఆయెను దూరం
నాపడకటిల్లాయెను ఇక భారం
చితికిన బతుకులో మిమగిలె శోకం
వెతికినా దొరుకునా నాకు ఇక
 నాకం


కామెంట్‌లు