మనలోని దుఃఖానికి
యెనలేని సుఖానికి
మూలం మన మనసు
తెలిసి చేయకు అలుసు !
మనలోని మోహానికి
ఘన సమ్మోహనానికి
మూలం మన మనసు
తెలిసి చేయకు అలుసు !
మన వేదన ఆవేదనకు
ఘన వాద వివాదాలకు
కారణం మన మనసు
తెలిసి చేయకు అలుసు !
మదిలోని ఆశ నిరాశలకు
హృదిలోని రాఘద్వేశాలకు
మూలం మనలోని మనసు
తెలిసి చేయకు నీవు అలుసు!
వికసించే విజ్ఞానానికి
కబళించే అజ్ఞానానికి
మనసు వేస్తుంది గాలం
తెలుసుకో ఈ ఇంద్రజాలం !
బంధాలకు అనుబంధాలకు
అందాలకు ఆనందాలకు
మన మనసు వేస్తుంది గాలం
తెలుసుకో నీవు ఈ ఇంద్రజాలం !
మనకు భగవంతునికి
గురువుకు శిష్యునికి
మనసు వేస్తుంది అడ్డుతెర
తెలసి మసులుకో నీవు జర !
కక్షలకు కార్పన్యాలకు
రక్షణకు సంరక్షణకు
మూలం మన మనసు
తెలిసి చేయకు అలుసు !
సంభవించు లాభనష్టాలకు
ప్రభవించు లోబ ప్రలోభాలకు
మన మనసు వేస్తుంది గాలం
తులసుకో ఇక ఈ ఇంద్రజాలం !
మన పాప పుణ్యాలకు
ఘన ప్రాయ చిత్తాలకు
మూలం మన మనసు
కాన చేయకు అలుసు. !
వాదించు న్యాయానికి
వేధించు అన్యాయానికి
మూలం మన మనసు
చేయబోకు నీవు అలుసు !
అనుగ్రహ అగ్రహాలకు
పొందే స్వర్గ నరకాలకు
హేతువు మన మనసు
తెలిసి చేయకు అలుసు !
శాంతి అశాంతులకు
క్రాంతి విక్రాంతులకు
కారణం మన మనసు
తెలిసి చేయకు అలుసు !
మనసు ఆడు ఈ నాటకం
సంభవించు కరువు కాటకం
ఈ రెండు రైలు పట్టాలాంటివి
అని వెంటనే నీవు కనుగొంటివి !
కనుగొన్న ఈ విషయాలను
ఆచరించి నీవు నడుచుకో
ఈ సంసార సాగరాన్ని ఈది
కష్టాల కన్నీళ్లను తుడుచుకో !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి