పెళ్లి సోకు ఉన్నదానా !: - గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
 పిల్లి కళ్ళ చిన్నదానా
పెళ్లి సోకు ఉన్నదానా
ఆగలేనని  అంటవూ
వేగలేక ఇక ఉంటవూ  !
          నువు పెళ్లి పెళ్లి అంటవు
          నను కాల్చుకోని తింటవు
           వెంట పడుతూ ఉంటవు
          తుంట బాబుతు ఉంటవు!
పెళ్లి గోలను చేయకే
కళ్ళు నీవు మూయకే
మత్తు కళ్ళతో చూడకే
చిత్తు నన్నిక చేయకే.  !
           పెళ్లి సోకు మానుకోవే
           మళ్లి నీవిక  కోలుకోవే
            పిల్లి కళ్ళ చిన్నదాన
            పెళ్లి ఈడు రానిదాన. !
పెళ్లి పిచ్చి పట్టినీవు
కన్ను నాకు కొట్టినావు
చేయకు నీవిక ఏతప్పు
చేస్తే వచ్చు నీకు ముప్పు 
మరదలా ఓ నా మరదలా
చుట్ట మాకు నీవు వరదలా       
          ప్రేమ దోమ కుట్టి
          పెళ్లి మోజు పట్టి
          కొట్ట వద్దు కన్ను
          ముట్ట వద్దు నన్ను !
పెళ్లి పెళ్లి అంటూ
కలలు నీవు కంటూ
గాలిలోన తేలిపోకు
ఆలినని వాలిపోకు !
            పెళ్లి కళ వచ్చినని
            ఆడకు నీవు అబద్ధం
            పిన్న వయసు వారికి
             పెళ్లి కూడా నిషిద్ధం !
పెళ్లి చేయమంటూ
మళ్లి అడుగుతుంటూ
ఎందుకు చేస్తావు గోల
ముందుకు రావద్దు బాల !
           మీ అమ్మ నాన్న వచ్చి
           నీ పెళ్లి గోల ఇక నచ్చి
           చేస్తానంటే నీవొప్పుకో. 
           చేయకుంటే ఇకతప్పుకో !

కామెంట్‌లు