యుద్ధం యుద్ధం: -గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977-నాగర్ కర్నూల్ జిల్లా.
 యుద్ధం యుద్ధం యుద్ధం
     చేయుటకు కావాలి సిద్ధం
     కలుగు అప్పుడే విజయం
     తొలగు చప్పున అపజయం !

     యుద్ధం యుద్ధం యుద్ధం
     కావాలి అందరు సంసిద్ధం
     అప్పుడు శత్రువు అదురు
     ఎప్పుడు ఉండదు బెదురు !

     యుద్ధం యుద్ధం యుద్ధం
    మనమంతా కలిసి చేద్దాం
    అప్పుడు తొలగును హాని
    ఇప్పుడు చేయాలిక బోణి !

    యుద్ధం యుద్ధం యుద్ధం
    చేయుటకు అందర్నీ ఒప్పిదం
   ఒరిగేటి నష్టాన్ని ఇక చెప్పేద్దం 
   జరిగేటి ముప్పును తప్పిదం !

    యుద్ధం యుద్ధం యుద్ధం
    కాదులే మనకు నిషిద్ధం
    శిక్షణతో కావాలిక సిద్ధం
    తక్షణమే విజయం తథ్యం !

  న్యాయాన్ని రక్షించుటకు
  అన్యాయాన్ని శిక్షించుటకు
  జరుగు పోరు పేరే యుద్ధం
  అని చెప్పి చేయాలి సన్నద్ధం !

  న్యాయ అన్యాయాలకై పూర్వం
  కౌరవ పాండవులు అపూర్వంగా
  చేసిరిగా వారు కురుక్షేత్ర యుద్ధం
  అయ్యిందిగా అది జగత్ ప్రసిద్ధం!

  ఈ దినంచేసే ఈ యుద్ధం
 జనానికి కారాదు నిరుద్దం
  ఒప్పించి చేయలి సన్నద్ధం
  మెప్పించి చేయాలి ప్రసిద్ధం !

 యుద్ధం యుద్ధం యుద్ధం
 చేయకండి మీరు రాద్ధాంతం
 సమర గీతాన్ని సరిగ్గా జపిద్దాం
 సమరం చేయుటకు తపిద్దాం !


కామెంట్‌లు